మామడ, మే 27 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని రాశిమెట్ల గ్రామంలో భీమన్న ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో శుక్రవారం మంత్రి పాల్గొన్నారు. జగదాంబ సేవాలాల్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వస్తాపూర్ సర్పంచ్ సంతోష్ వివాహా నికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. మంత్రిని ఘనంగా సన్మానించారు. నాయకులు రాంకిషన్‌రెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్, గంగారెడ్డి, భాస్కర్‌రావు, రాందాస్, ఎంపీడీవో మల్లేశం, తహల్దార్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, మే 27 : బాలల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వరల్డ్ విజన్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన పిల్లల గురించి ప్రభుత్వ పథకాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రోగ్రాం మేనేజర్ బ్రహ్మన్న, మురళి, వాక్సినేషన్ డిస్ట్రిక్ కో ఆర్డినేటర్ విశ్వాస్, మోహన్ తదితరులున్నారు.