ముథోల్, మే 27 : రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు.. మన బడి కార్యక్రమం కింద పాఠశాల లను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొ న్నారు. ముథోల్‌లోని ప్రాథమికోన్నత పాఠశాల లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగం గా రూ. 30 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందు కు ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ముథోల్‌లోని పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా లాట్షా కబ్రస్తాన్ ప్రహరీ నిర్మాణానికి రూ. 2.50 లక్షలు, ఖర్బాల వ్యవసాయ రోడ్డు పనులకు రూ. 2.50 లక్షల నిధులను మంజూరు చేసి వాటి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.
మున్నూరుకాపు సంఘం బలోపేతానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. ముథో ల్లోని మహాలక్ష్మి వీధిలోని మున్నూ రుకాపు సంఘం భవనానికి రూ. 2.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. దానికి సంబంధిం చిన ప్రొసీడింగ్ కాపీని సంఘం సభ్యులకు అంద జేశారు.
అనంతరం ఎమ్మెల్యేను సంఘం సభ్యు లు శాలువాతో సత్కరించారు. ఆయా చోట్ల సర్పంచ్ రాజేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు అఫ్రోజ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, బ్రహ్మ ణ్గావ్ సర్పంచ్ రాంరెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, రమాకాంత్, రవి, గోపి పటేల్, కోఆప్షన్ సభ్యుడు మగ్దూమ్, శ్రీనివాస్ గౌడ్, రాజు, అధ్యక్షుడు రాజు, పత్తినొళ్ల సాయి తదితరులు పాల్గొన్నారు.