కుభీర్, మే 25 : తెలంగాణ సర్కారు ఆల యాల నిర్మాణానికి పెద్ద పీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. సాంగ్వి గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో దేవా దాయశాఖ నిధులు రూ.40 లక్షలతో చేపట్టనున్న కల్యాణ మండపం నిర్మాణ పనులను గురువారం ఆయన స్థానిక సర్పంచ్ న్యాలపట్ల దత్తుగౌడ్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్ తో కలిసి భూమిపూజ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోనే నిధులు మంజూరు అవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్నికులాల ను సమాన దృష్టితో చూస్తున్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేను సర్పంచ్, గ్రామస్తులు శాలువాతో సత్కరించారు. కాగా పల్సి గ్రామంలో నవ దంప తులు తోట శేఖర్-సౌమ్యలను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆశీర్వదించారు. ఆయా చోట్ల టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, ఏఎంసీ చైర్మన్ కందూర్ సంతోష్, సింగిల్ విండో చైర్మన్ రేకుల గంగాచరణ్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, ఉప సర్పంచ్ దత్తాత్రి, శ్రీరాముల రాజేశ్‌చారి, సాహెబ్ రావు, తోట రాందాస్, నాయకులు ఉన్నారు.