భైంసా, మే 26 : రైతులు, వినియోగదారులు విద్యుత్‌ను వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీ రంగారావు ఆదేశించారు. పట్టణం లోని ఎన్ఆర్ గార్డెన్లో విద్యుత్తు వినియో గదా రులతో గురువారం ముఖాముఖీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరంతరాయంగా వ్యవ సాయదారులకు 24 గంటల విద్యుత్తు అందిస్తు న్నదన్నారు.
వ్యవసాయరంగం కుదేలు కాకుండా ఉండేందుకు 24గంటల విద్యుత్తు అందిస్తున్నద ని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. అంతేకాకుండా 25 రోజుల కోసం రూ. 2500 కోట్లతో విద్యుత్తును కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నదని పేర్కొ న్నారు. అనంతరం పలువురు సమస్యలను విన్నవించారు. వాటిని అధికారులు పరిష్కరించా లని సూచించారు. టెక్నికల్ మెంబర్ మనోహర్ రాజు, ఫైనాన్స్ మెంబర్ బండారు కృష్ణయ్య, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.