కొత్తగూడెం సింగరేణి, మే 23: సింగరేణి సంస్థలో రా నున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో జాతీయ సంఘా లకు ఓటడిగే హక్కు లేదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం రాత్రి బస్టాండ్ సెంటర్లోని కార్పొరేట్ టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమ్రంతి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలతో పాటు ఇ వ్వని వాటినీ కూడా నెరవేర్చి కార్మికులపై ప్రేమ చాటుకున్నారన్నారు.
జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించిన ఘనత సీఎం కేసీఆర్, తెలంగాణ బొ గ్గుగని కార్మిక సంఘానికి దక్కుతుందని స్పష్టం చేశారు. కోలిండియాలో లేని హక్కులను సైతం సింగరేణిలో క ల్పించిన, సాధించిన టీబీజీకేఎస్నే రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కార్మికుల హక్కు లను పోగొట్టిన జాతీయ కార్మిక సంఘాలకు ఓటు వేస్తే ఆ ఓటు వృథా అవుతుందని స్పష్టం చేశారు.
సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడొచ్చినా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్రావ్ పిలుపునిచ్చా రు. సోమవారం సాయంత్రం కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ కార్మిక సం ఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి సీఎం కేసీఆర్ పునరుద్దరిస్తే జాతీయ కార్మిక సంఘాలు హైకోర్టులో కేసు వేసి నిలిపివేశారని దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్‌కు సింగరేణి కార్మికులపై ఉన్న అపార ప్రేమతో మేధావులతో చర్చించి సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ పేరుతో తిరిగి తండ్రి కొడుకుల ఉద్యోగాలను పు నరుద్ధరించారని అన్నారు. కార్మికుల సొంతింటి కల కోసం రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాన్ని ఇచ్చారని, సింగరేణి క్వార్టర్లలో ఉన్న కార్మికులకు ఏసీలపై కరెంట్ ఛార్జీలు లేకుండా చేసిన ఘనత టీబీజీకేఎస్‌కే దక్కుతుందన్నా రు. వారసత్వ ఉద్యోగాలు కొనసాగాలన్నా, కార్మికులకు బంగా రు భవిష్యత్తు ఉండాలన్నా టీబీజీకేఎస్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
సింగరేణిలో ఇప్పటి వరకు 89 మెడికల్ బోర్డులు నిర్వహించారని, 10,331 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ పొం దారని, వీరిలో 8 వేలకు పైగా ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. టీబీజీకేఎస్‌ను రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రమశక్తి అవార్డు గ్రహీతలు సోమిరెడ్డి, ఎంజీ రజాక్‌లను పూలమాల, శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.
టీబీజీకేఎస్ కార్పొరేట్ ఉపాధ్యక్షుడు ముప్పాని సోమిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మీ, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఊకంటి గోపాలరావు, కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్, 11మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, టీబీజీకేఎస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, వలస కుమార్, చిన్ని, జేబీ మోహన్, జాన్సన్ సుధాకర్, తిరుపతిరావు, ర ఘు, కార్పొరేట్ ఏరియాలోని అన్ని విభాగాల పిట్ సెక్రటరీలు, కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.