బోథ్, మే 9 : రైతులు పంట మార్పిడి విధానం పాటిస్తే దిగుబడులు వస్తాయని బోథ్ మండల వ్యవసాయ శాఖ ధికారి వెండి విశ్వామిత్ర సూచించారు. పొచ్చెర గ్రామంలోని రైతు వేదిక భనంలో సోమవారం రైతులకు వానకాలం సాగు సన్నద్ధతపై అవగాహన సదస్సు నిర్వహింంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ ఎరువులు వాడితే భూసారం దెబ్బతినదన్నారు. అధికారులు సూచించిన మేరకే ఎరువులు వాడాలన్నారు. విత్తనాలు, పురుగులు మందుల కొనుగోలు సమయంలో తప్పని సరిగా రసీదులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీధర్స్వామి, ఏఈవో దివ్య, సర్పంచ్ మల్లేశ్, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ హన్మంత్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, మే 9: రైతులు పంట చేనులో వేసవి దుక్కులు దున్నడంతో లాభం చేకూరుతుందని ఏఈవో సాయికృష్ణ అన్నారు. వానకాలం పంటల సాగులో భాగంగా మండలంలోని నర్సాపూర్ గ్రామంలో రైతులకు వేసవి దుక్కులు, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంలో ద్రవ జీవామృతం గురించి వివరించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
నార్నూర్, మే 9 : ప్రభుత్వ అనుమతి ఉన్న విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారి గిత్తే రమేశ్ రైతులకు సూచించారు. మండలంలోని మాన్కాపూర్ గ్రామంలో రైతులకు వానకాలం సాగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాథోడ్ సావీందర్, ఉపసర్పంచ్ రాయిసిడాం రూప్దేవ్, మాజీ ఎంపీపీ మెస్రం రూప్దేవ్, ఏఈవో రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, మే 9: రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని ఏఈవో దేవేందర్ సూచించారు. మండలంలోని చింతకర్ర గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. లైసెన్స్ ఉన్న దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సిడాం పుల్లబాయి, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ పెందూర్ రఘనాథ్, రైతులు నాగోరావ్, తిరుపతి, మానిక్రావ్ తదితరులు పాల్గొన్నారు.