బాసర, మే 3 : బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ కనిపించింది. అక్షయ తృతీయ పర్వదినం కావడంతో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. తెలుగు రాష్ర్టాలతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో క్యూలైన్లో భక్తుల రద్దీ కనిపించింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు తమ పిల్లలకు అక్షయ తృతీయను పురస్కరించుకొని అక్షర శ్రీకారాలు నిర్వహించారు. భక్తులకు అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.