నిర్మల్ అర్బన్, జూలై 13 : ప్రతి విద్యార్థికి నులి పురుగుల నివారణ మాత్రలు అందించాలని నిర్మల్ కలెక్టర్ భవే శ్ మిశ్రా అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని సోఫినగర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాత్రలు అందజేశారు. ఆల్బెండజోల్ మాత్రల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేందర్, డీఈవో భోజన్న, ఇమ్యూనైజేషన్ అధికారి నయనారెడ్డి, అధికారులు రవీందర్, ప్రిన్సిపాల్ డానియల్ ఉన్నారు.
చిన్నారుల ఆరోగ్యమే ప్రధానం..
ఎదులాపురం, జూలై 17 : చిన్నారుల ఆరోగ్య రక్షణతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమని, వారి ఆరోగ్యమే ప్రధానమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బ్రాహ్మణవాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని ప్ర భుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లోని పిల్లలందరికీ వంద శాతం ఆల్బెండజోల్ మా త్రలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఈవో మాధవి, జిల్లా వై ద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సాధ న, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గణేశ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు అపర్ణ, స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.