బోథ్, మే 7 : సంప్రదాయ వ్యవసాయ విధానాలకు స్వస్తి చెప్పి, వినూత్న సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం బోథ్ రైతు వేదికలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ రైతు వారోత్సవాలకు హాజరయ్యారు. డ్రోన్ ద్వారా పురుగు మందు పిచికారీ వల్ల పెట్టుబడి తగ్గుతుంద న్నారు.
నిరుద్యోగ యువత బృందాలుగా పీఎం ఉ పాధి కల్పన పథకం కింద 35 నుంచి 40 శాతం రా యితీతో కొనుగోలు చేసి ఉపాధి పొందవచ్చని తె లిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, చీ ఫ్ ఇంజినీర్ హాన్, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, స ర్పంచ్ అన్నపూర్ణ, ఉప సర్పంచ్ విజయలక్ష్మి, శాస్త్రవే త్త ప్రవీణ్, వ్యవసాయ అధికారి శివకుమార్, ఎం పీడీవో రమేశ్, తహసీల్దార్ సుభాష్చందర్ ఉన్నారు.