ఎదులాపురం, మే16: దోమలతో వ్యాప్తి చెం దే డెంగీ, మలేరియా, పైలేరియా తదితర వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జా తీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలోని బస్తీ దవాఖానలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ రాజర్షి షాకు డీఎంహెచ్‌వో పూలమొక్కను అందజేసి స్వాగ తం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై అన్ని శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే ప్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. మురుగునీటితో దోమ లార్వా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ కేసులు పెరిగితే వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ప్రైవేట్ దవాఖానలో డెంగ్యూ నిర్దారణ పరీక్షల యంత్రం లేదని కేవలం రిమ్స్ దవాఖానలోనే ఉందని స్పష్టం చేశారు.
నీటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఏఎంసీ పరీక్షలు నిర్వహించాలని, అవసరం ఉన్న సమయంలోనే ప్రభుత్వ వాహనంలోనే పంపించాలన్నారు. అంగన్వాడీ కోసం పక్కా భవనం నిర్మాణానికి ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. వ్యాధుల నివారణే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం టీబీ వ్యాధి గ్రామస్తులకు కలెక్టర్ నిక్షయా పోషన్ కిట్లను అందజేశారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కా ర్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో సాధన, జిల్లా మలేరియా ఆఫీసర్ ఎం. శ్రీధర్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, మెడికల్ ఆఫీసర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, మే,16 : డెంగీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నిర్మల్ డీఎంహెచ్‌వో రాజేందర్ అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్‌లో శుక్రవారం వైద్య సిబ్బంది భారీ ర్యాలీ తీశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో ప్రతి శుక్రవారం, మంగళవారం డ్రై డేగా పాటించి నీటి నిల్వలను తొలగించాలని, పరిసరాల శుభ్రత పాటించి దోమలను నిర్మూలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ అధికారి శ్రీనివాస్, డిప్యూటీ జిల్లా విస్తరణ అధికారి బారె రవీందర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్, వైద్యాధికారులు తేజస్విని, మనిషా, డీపీహెచ్‌ఎన్‌వో సాయమ్మ, ఆరోగ్య పర్యవేక్షకులు భోజారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్, మతిన్, ఆరోగ్య సహాయకులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.