ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులను ఇగం వణికిస్తున్నది. పొద్దంతా ఈదురుగాలులు వీచడం.. రాత్రిళ్లు చలితో గిరిజనులు గజగజ వణికిపోతున్నారు. ఈ సీజన్లో ఆదివారం రికార్డుస్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(యు)లో 4.7 డిగ్రీల సెల్సియస్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ రిజర్వ్ఫారెస్ట్లో 6.7, ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో 7.2, నిర్మల్ జిల్లా పెంబిలో 8 డిగ్రీల అత్యల్ప టెంపరేచర్ రికార్డు అయ్యింది.
దట్టమైన పొగమంచు కమ్ముకోవడం, జిల్లా మరో కశ్మీరాన్ని తలపించడంతో అడవిబిడ్డలు, చిన్నా రులు, వృద్ధులు బయటకు వెళ్లడానికి బెంబేలెత్తి పోతు న్నారు. ప్రధానంగా అడవులు, జలవనరులు అధికంగా ఉండడం, సహ్యాద్రి పర్వత శ్రేణులు ఉండడమే కారణ మని వాతావరణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ)