నస్పూర్, జూన్ 24 : మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో సివిల్స్‌లో అదనపు కలెక్టర్‌గా ఎంపికైన రాహుల్, జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థుల కోసం లైబ్రరీలను ఆధునీకరించి సౌకర్యాలు కల్పించారు.