బెల్లంపల్లి, డిసెంబర్ 28: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దరఖాస్తుతో పాటుగా తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేస్తే సరిపోతుందని వివరించారు. రేషన్ కార్డు లేని వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్న విషయం ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు.
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని తెలిపారు. 1, 11, 13 వార్డుల్లో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ నోడల్ అధికారి హరికృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. 24, 25 వార్డుల పరిధిలోని కాల్టెక్స్, అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఏసీపీ పంతాటి సదయ్య పర్యవేక్షించారు. బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్‌కుమార్ గౌడ్, టూటూన్ ఎస్ఐ రవీందర్‌తో కలిసి ఆయన తగు సూచనలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు.
మంచిర్యాలటౌన్, డిసెంబర్ 28: మంచిర్యాల పట్టణంలోని 19వ వార్డు కాలేజ్రోడ్లో ఏర్పాటుచేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బీ రాహుల్ పరిశీలించారు. సిబ్బంది పనితీరు, అక్కడికి వచ్చే ప్రజలు కోరుకుంటున్న సేవలు, వారికి అధికారులు, సిబ్బంది నుంచి అందుతున్న సహకారం, దరఖాస్తుల స్వీకరణ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ఏ మారుతీప్రసాద్, మున్సిపల్ ఇంజినీర్ మధూకర్, మేనేజర్ విజయ్‌కుమార్, వార్డు ఆఫీసర్, సిబ్బంది ఉన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లోని ప్రధాన కూడళ్ల వద్ద దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లలో మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరించారు. 5564 మంది తమ దరఖాస్తులను అందజేశారు. వీటితో పాటు కొత్త రేషన్‌కార్డుల కోసం పలువురు దరఖాస్తులు అందించారు. ఒక్కో వార్డుకు దరఖాస్తుల స్వీకరణకు ఒక వార్డు ఆఫీసర్, ముగ్గురు సిబ్బందిని నియమించా రు. 6 వార్డులకు ఒక సూపర్వైజర్ను నియమించారు.
హాజీపూర్, డిసెంబర్ 28 : మండలంలోని ర్యాలీ, చిన్నగోపాల్పూర్, నాగారం, గఢ్‌పూర్ గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి జడ్పీ సీఈవో నరేందర్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నరేందర్, హాజీపూర్ తహసీల్దార్ సతీశ్ కుమార్, ఎంపీడీవో అబ్దుల్ హై, ఏపీవో మల్లయ్య, ఏపీఎం శ్రీనివాస్‌గౌడ్, మండల వ్యవసాయ అధికారిణి మార్గం రజిత, డిప్యూటీ తహసీల్దార్ హరిత, విద్యుత్ శాఖ ఏఈ మహేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఏఈ కామేశ్వర్ రెడ్డి, ఆర్ఐలు మంగ, ప్రభు, ఎస్ఐ వెంకన్నగౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శులు, మండల నాయకులు రఫిక్‌తో పాటు మండల అధికారులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
దండేపల్లి, డిసెంబర్ 28: దండేపల్లి మండలంలోని రెబ్బెన్‌పెల్లి, ధర్మరావుపేట, మేదరిపేట, నంబాల గ్రామాల్లో గురువారం ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. 100 మంది ఒకటి చొప్పున ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, జడ్పీటీసీ గడ్డం నాగరాణి, ఎంపీడీవో మల్లేశ్, డిప్యూటీ తహసీల్దార్ విజయ, ఆర్ఐలు చంద్రమౌళి, భూమన్న, ఎంపీవో శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు కందుల కల్యాణి, డంకా లక్ష్మణ్, పుష్పలత, దేవక్క, ఎంపీటీసీలు బత్తుల మౌనిక, కొంగల నవీన్, బొడ్డు కమలాకర్, వ్యవసాయాధికారి అంజిత్‌కుమార్, జీపీ కార్యదర్శులు శ్రావణ్, గంగారాం, వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలున్నారు.
చెన్నూర్, డిసెంబర్ 28: చెన్నూర్‌లో 18 వార్డుల్లో కేంద్రాలను ఏర్పాటు చేసిన దరఖాస్తులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ రాహుల్ ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ అర్చనాగిల్డా, అదనపు కలెక్టర్ రాహుల్ లబ్ధిదారులకు ప్రజా పాలన దరఖాస్తులను పంపిణీ చేశారు. దరఖాస్తులు ఫారాలు అందకపోవడంతో అధికారులను ప్రజలు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్, డిసెంబర్ 28: మండలంలోని అంకుశం, బుచ్చయ్యపల్లి, గురిజాల, దుగినేపల్లి గ్రామాల్లో దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డీ రాజేందర్, తహసీల్దార్ సుధాకర్ సర్పంచులు రాజమౌళి, పోలవేని మాధవి, గాజుల రంజిత, డోలె సురేశ్, ఎంపీటీసీలు ముడిమడుగుల మహేందర్, కారుకూరి రాంచందర్, ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, ఏఈ రాంమనోహర్, ఏపీఎం శ్యామల, ఇరిగేషన్ ఏఈ ప్రణీత్, పీఆర్ ఏఈ విష్ణుకుమార్, ఏపీవో ఈస్తర్ డేవిడ్, కాంగ్రెస్ నాయకులు సింగతి సత్తన్న, దుర్గం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి , డిసెంబర్ 28: ప్రజాపాలనలో దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. నక్కలపల్లిలో ప్రారంభించిన ప్రజాపాలనను ఆయన సందర్శించారు. గ్రామస్తుల నుంచి దరఖాస్తుల స్వీకరణపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి కార్యక్రమంలో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి సురేఖ, డీఆర్డీవో శేషాద్రి, ఎంపీడీవో భాస్కర్, ఏవో మహేందర్, సర్పంచ్ స్రవంతి పలు శాఖల అధికారులున్నారు
భీమారం, డిసెంబర్ 28 : మండలంలోని నర్సింగాపూర్, ఆరెపల్లి, పోలంపల్లి, బూర్గుపల్లి గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని అధికారులు, సర్పంచ్‌లు కలిసి ప్రారంభించారు. నర్సింగాపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో శేషాద్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విశ్వంబర్, ఎస్ఐ రాజావర్ధన్, ఆర్ఐ స్రవంతి, ఇరిగేషన్ ఏఈ అఖిల్, విద్యుత్ ఏఈ కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, డిసెంబర్ 28: అక్కెపల్లి గ్రామపంచాయతీలో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపు రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఓత్కులపల్లి, చింతలపల్లి, పొన్నారం కార్యక్రమం కొనసాగింది. శుక్రవారం సంకారం, బుద్ధారం, చాకెపల్లి, సోమన్‌పల్లి గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పెద్దింటి స్వరూప, మాడ సుమలత, ఐకేపీ ఏపీఎం ప్రమీల, ట్రాన్స్‌కో ఏఈలు భాస్కర్, శ్రీనివాస్, డీటీ సంతోష్, నాయకులు పెద్దింటి రాజన్న, మాడ మాధవరెడ్డి, పంచాయతీ సెక్రటరీలు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
వేమనపల్లి, డిసెంబర్ 28 : వేమనపల్లి మండలంలో సుంపుటంలో 60 మంది, కల్లెంపల్లిలో 28 మంది మొత్తం 88 మంది దరఖాస్తు చేసుకున్నట్లు మండల స్పెషల్ ఆఫీసర్ ఉదయ్‌కుమార్, తహసీల్దార్ సదానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మయ్య, ఎంపీపీ స్వర్ణలత, సింగిల్ విండో చైర్మన్ కుబిడె వెంకటేశం, సర్పంచ్ కొండగొర్ల బాపు, కుస్రం పద్మ, పంచాయతీ కార్యదర్శులు సిరాజ్, సుదర్శన్, అంగన్వాడీ, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
తాండూర్, డిసెంబర్ 28 : మండలంలోని బోయపల్లి, రాజీవ్‌నగర్ గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, బుగ్గ దేవస్థానం చైర్ పర్సన్ మాసాడి శ్రీదేవి, బోయపల్లి, రాజీవ్‌నగర్ సర్పంచ్‌లు భీమ సునీత, కల్వల క్రిస్టఫర్, ఎంపీటీసీ సూరం రవీందర్‌రెడ్డి, సీఐ కే శ్రీనివాసరావు, ఎస్ఐ ఎస్ రాజశేఖర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, డిసెంబర్ 28: సీసీసీ నస్పూర్‌లో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 1వ వార్డు, 23వ వార్డు, 24వ వార్డు, 25వ వార్డులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణను నస్పూర్‌కాలనీ సింగరేణి మనోరంజన్ సముదాయ్‌లో ఏర్పాటు చేశారు. 2వ వార్డుకు ప్రశాంత్‌నగర్ అంగన్వాడీ పాఠశాలలో ఏర్పాటు చేశారు. 10వార్డుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయం, 11వ వార్డు అంబేద్కర్‌భవన్, 12వ వార్డుకు తాళ్లపల్లి పునరావాసకాలనీ, 13వ వార్డు సింగరేణి ఫంక్షన్ హాల్, 14వ వార్డు ప్రశాంత్‌నగర్ అంగన్వాడీ స్కూల్, 15వ వార్డు సంఘమల్లయ్యపల్లె, 18, 19, 21 వార్డులకు తీగల్‌పహాడ్ పాత జీపీ కార్యాలయం, 20వ వార్డుకు సీతారాంపల్లి రైతు వేదిక, 22వ వార్డుకు విద్యానగర్ కృష్ణవేణి పాఠశాలలో ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. చాలా మంది దరఖాస్తు ఎలా చేయాలో తెలియక ఇబ్బందిపడ్డారు. దరఖాస్తుల స్వీకరణ సెంటర్లను మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ పరిశీలించారు.
లక్షెట్టిపేట, డిసెంబర్ 28: మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లను మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య ప్రారంభించారు. ప్రజల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, ఎమ్మార్వో రాఘవేంద్రారావు, కౌన్సిలర్లు చెల్ల నాగభూషణం, రాందేని వెంకటేశ్, సురేశ్ నాయక్, శ్రీకాంత్, షబాన, అఫ్రీన్ సుల్తానా, చింత సువర్ణ, రాందేని సుజాత, మెట్టు కల్యాణి, ఉమాదేవి, లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
జన్నారం, డిసెంబర్ 28 : మండలంలో ఎంపీడీవో అరుణారాణి, తహసీల్దార్ వేణుగోపాల్ రెండు టీలుగా ఏర్పాడి వెంకటాపూర్, మొర్రిగూడ, మల్యాల, మహ్మదాబాద్ గ్రామ సభలు నిర్వహించారు. వెంకటాపూర్‌లో 211 వచ్చాయి, మొర్రిగూడలో 239, మల్యాలలో 173, మహ్మదాబాద్‌లో 158 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో అరుణారాణి, తహసీల్దార్ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్, భానుచందర్, ఏవో సంగీత, సందేశ్, ఏఈవో అక్రముల్లా, పద్మ, సర్పంచ్ సుమలత, గోపాల్‌నాయక్, లక్ష్మణ్, హన్మంతరావు టీం సభ్యులు పాల్గొన్నారు.
కాసిపేట, డిసెంబర్ 28 : కాసిపేట మండలంలోని సోమగూడెం(కే), లంబాడీతండా(కే), మామిడిగూడెం, చిన్న ధర్మారం గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గంగారాం, ఎంపీడీవో ఎంఏ అలీం, తహసీల్దార్ భోజన్న, సర్పంచ్‌లు సపాట్ శంకర్, సంపత్ నాయక్, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, అక్కెపల్లి లక్ష్మి, ఉప సర్పంచ్‌లు కనుకుల రాకేశ్, తిరుమల్, ఎంపీవో నాగరాజు, హెచ్ఎంలు రాథోడ్ రమేశ్, సుధాకర్ నాయక్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధిక, ఉపాధ్యాయులు జంగంపల్లి సురేశ్, కార్యదర్శులు సురేశ్, శ్వేత, కీర్తి, గ్రామస్తులున్నారు.
రామకృష్ణాపూర్, డిసెంబర్ 28: క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో అధికారులు దరఖాస్తుల స్వీకరించారు. 1వ, 2వ వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎస్ఐ రాజశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట, పులిమడుగు గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసి ప్రజాపాలన శిబిరాల్లో దరఖాస్తులను స్వీకరించారు.
మందమర్రి రూరల్ డిసెంబర్ 28: మండలంలోని సారంగపల్లి, శంకర్‌పల్లిలో సీపీవో, మండల స్పెషల్ ఆఫీసర్ సత్యం, ఎంపీడీవో శశికళ, ఎంపీవో భీరయ్య, పొన్నారం, పులిమడుగులో తహసీల్దార్ చంద్రశేఖర్ 250 దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుర్రం మంగ, జడ్పీటీసీ వేల్పుల రవి, గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఆశ కార్యకర్తలు, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.
నెన్నెల, డిసెంబర్ 29 : నెన్నెల మండలంలో నందుపల్లి, మన్నెగూడెం, జోగాపూర్, ఘన్పూర్ గ్రామాల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ శ్యామల, ప్రత్యేక అధికారి సిడాం దత్తు, తహసీల్దార్ ఇమ్రాన్, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో నవీన్, ఏఈవో రాంచందర్, సర్పంచ్‌లు మల్లేశ్, గొర్లపల్లిబాపు, పంజాల లక్ష్మి, నవీన్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రాంచందర్, సాగర్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
జైపూర్, డిసెంబర్ 28; రామారావుపేటలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, గంగిపల్లిలో జడ్పీసీఈవో నరేందర్, ఇందారంలో డీఆర్డీవో శేషాద్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీపీ గోదారి రమాదేవి, అధికారులు పాల్గొన్నారు.
మందమర్రి, డిసెంబర్ 28: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో మున్సిపల్ అధికారులు వార్డుకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ సందర్శించారు. మందమర్రి సీఐ గట్ల మహేందర్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఎస్ఐ చంద్రకుమార్, పరిశీలించారు. మొదటి రోజు 790 మంది దరఖాస్తులను సమర్పించినట్లు కమిషనర్ రాజు తెలిపారు.
కన్నెపల్లి, డిసెంబర్ 29 : మండలంలోని ముత్తాపూర్, వీరాపూర్, రెబ్బెన, టేకులపల్లి గ్రామాల్లో గురువారం అధికారులు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించారు. ముత్తాపూర్లో 101, రెబ్బెనలో 113, వీరాపూర్‌లో 204, టేకులపల్లిలో 92 , మొత్తం 510 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ దత్తు ప్రసాద్‌రావు, ఎంపీడీవో రాధాకిషన్, మండల ప్రత్యేకాధికారి యాదయ్య తెలిపారు. ముత్తాపూర్లోని గ్రామసభను జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ సందర్శించారు.