నార్నూర్, అక్టోబర్ 9 : ఆదివాసీ హక్కులకై నైజాం సర్కారుతో పోరాడిన యోధుడు కుమ్రం భీంను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు ఆడ శ్రీరామ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుండాల గ్రామంలో కుమ్రం భీం 85వ వర్ధంతిని నిర్వహించారు. కుమ్రం భీం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందు కెళ్లాలన్నారు. ఆదివాసులు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తీరం మాల్కుపటేల్, ఆత్రం భీం రావు, కుమ్రం భీం రావు, మెస్రం ఆనంద్ రావు,సలాం రాజు, కోట్నాక్ లచ్చు, సలాం చంపత్ రావు, మడావి జంగు, హన్మంతరావు తదితరులున్నారు.