తాండూర్ : విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ వో సుధాకర్ నాయక్ ( Sudhakar Nayak ) హెచ్చరించారు. సోమవారం తాండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ( PHC ) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది హాజరు రికార్డులను, మందుల నిల్వలు, పరిసరాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
మెడిసిన్ లభ్యతపై ఆరా తీశారు. వైద్యులు, వైద్య సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆసుపత్రిలో ఉండాలన్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు వెంటనే చికిత్స అందించాలని అన్నారు. నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట వైద్యులు ఝాన్సీ, లక్ష్మి ప్రసన్న, సూపర్ వైజర్లు, సిబ్బంది ఉన్నారు.