తాండూర్ : వరంగల్ జిల్లాలోని స్మైల్ డీజీ హైస్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్‌పై పీడీఎస్‌యూ( PDSU) నాయకుల దాడిని( Attack) ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ( Black Badges ) ధరించి నిరసన తెలిపారు. గురువారం తాండూర్ మండల కేంద్రంలోని విద్యాభారతి విద్యాసంస్థల యాజమాన్యం, ఉపాధ్యాలు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సురభి శరత్ కుమార్ మాట్లాడుతూ విద్యాసంస్థల పై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. మండల కేంద్రంలో జోనల్ స్థాయి చెస్ పోటీల ప్రారంభానికి వచ్చిన మండల విద్యాధికారి ఎస్ మల్లేశంకు వినతి పత్రాన్ని అందజేశారు.