ఇంద్రవెల్లి : మండలంలోని ఇంటర్మీడియట్ పరీక్ష ( Intermediate examination) కేంద్రాలను ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ (Sub Collector Yuvraj Marmat ) బుధవారం తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు తాగునీరు, వైద్యంతోపాటు ఇతర విషయాలపై ఆరా తీశారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు (Mass copying) పాల్పడితే ఇన్విజిలేటర్ల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఇతరులు రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట అధికారులు, తదితరులు పాల్గొన్నారు.తొలిరోజు పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా కేంద్రంలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు హాల్ టికెట్ల ప్రకారంగా కేటాయించిన గదుల గురించి వివరించారు. హాల్లోకి వెళ్లే విద్యార్థులు కాపీయింగ్ పాల్పడకుండా తనిఖీలు చేశారు.