రోగుల ప్రాణాలతో చెలగాటం వద్దు
అనారోగ్యం, ఆపద పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి మంచిర్యాల ప్రభుత్వ జనరల్ దవాఖానకు వచ్చే రోగుల ప్రాణాలతో చెలగాటం వద్దని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ సూచించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గత బుధవారం జరిగిన సంఘటనను ‘నమస్తే తెలంగాణ’లో ‘రోగైనా... శవమైనా మా అంబులెన్స్‌లోనే’.. అనే కథనంపై ఆయన స్పందించారు.
- మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్
- ‘నమస్తే’ కథనానికి స్పందన
మంచిర్యాల ఏసీసీ, మార్చి 16: అనారోగ్యం, ఆపద పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి మంచిర్యాల ప్రభుత్వ జనరల్ దవాఖానకు వచ్చే రోగుల ప్రాణాలతో చెలగాటం వద్దని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ సూచించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గత బుధవారం జరిగిన సంఘటనను ‘నమస్తే తెలంగాణ’లో ‘రోగైనా… శవమైనా మా అంబులెన్స్‌లోనే’.. అనే కథనంపై ఆయన స్పందించారు. మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన వద్ద ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్లు, డ్రైవర్ల దౌర్జన్యంపై ఈ కథనం రాగా, మంచిర్యాల డీసీపీ ఆశోక్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్లో వారితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కమీషన్లకు లాలూచి పడి వారిని మోసగించవద్దని, వీలైతే వారికి సహాయం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. రోగులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. పద్ధతి మార్చుకోకపోతే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్ఐలు లక్ష్మణ్, మహేందర్, రాములు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

