పారదర్శకంగా ఓటరు జాబితా
జిల్లాలో సమగ్ర ఓటరు జాబితాను పకడ్బందీగా చేపట్టినట్లు నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు.
- నూతన నమోదుకు, మార్పులు, చేర్పులకు దరఖాస్తుల స్వీకరణ
- నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ టౌన్, డిసెంబర్ 5 : జిల్లాలో సమగ్ర ఓటరు జాబితాను పకడ్బందీగా చేపట్టినట్లు నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి స్పందన లభించిందన్నారు. 8వ తేదీ వరకు కొత్త ఓటరు నమోదుకు అవకాశం, మార్పులు, చేర్పులు, తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న వారిలో 26వేల మందికి గుర్తింపుకార్డులను ఇచ్చినట్లు తెలిపారు. వాటిని పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
అన్ని పోలింగ్ బూత్‌ల్లో బీఎల్వోల సమక్షంలో కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, పేర్ల తొలగింపు విచారణ జరిపిన తర్వాతనే తొలగిస్తున్నామని వివరించారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న వారికి ఆధార్ లింక్ 76 శాతం పూర్తయిందని, మరో 15 రోజుల్లో వందశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

