చెన్నూరు: మండలంలోని కొమ్మేర గ్రామానికి చెందిన జోగురి మధుకర్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. చెన్నూరు సీఐ రవీందర్ ( CI Ravindar ) తెలిపిన వివరాల ప్రకారం. డబ్బుల విషయంలో నాగపూర్ గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి వద్ద మధుకర్‌ను కొట్టాడని తెలిపారు. దీంతో మనస్తాపానికి తీవ్ర మనస్తాపానికి గురైన మధుకర్ ఇంటికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. మృతుడి తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.