బజార్ హత్నూర్ : రంజాన్ పండుగ వస్తున్న సందర్భంగా బజార్హత్నూర్లో గల ఈద్గా (Eidgah) అభివృద్ధికి సహకరించాలని మండల జామ మసీద్ కమిటీ సభ్యులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను (Both Mla Jadav) కోరారు. శుక్రవారం నెరడిగొండ మండల కేంద్రం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రంజాన్‌కు ఈద్గాలో పనులు, ఇతర సమస్యలను విన్నవించారు. వీరి వెంట కమిటీ సదర్ మజర్ కమిటీ సభ్యులు యూసుఫ్, అహ్మద్, షాహిద్, సలీం, అజర్, నాహిద్, సల్మాన్, , బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మజర్ ఉన్నారు.