ఉట్నూర్, జూన్ 8 ః ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణానికి చెందిన విద్యావంతుడు, కవి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ తెలుగు మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకంలో ఆయన రాసిన నవోదయం కథలహరిలోని పర్ధాన్ సంస్కృతి విశేషాలకు చోటు లభించింది. అయితే ఇటీవల బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవి విరమణ చేసిన మనోహర్ కవిగా రాణిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వేదికగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలపై ప్రపంచానికి తెలిసేలా జాతీయ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ చాటారు.