మంచిర్యాల అర్బన్ : రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) గాయపడిన వ్యక్తి మృతి చెందిన ఘటన మంచిర్యాల ( Mancheriyal Town) లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి ఏరియాలో నివాసముంటున్న రౌతు రాజన్న (58) అనే వ్యక్తి ఎస్ఐఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఈ నెల 3వ తేదీన పని నిమత్తం ద్విచక్ర వాహనంపై గోదావరిఖనికి వెళ్తుండగా సింగరేణి జీఎం కార్యాలయ వద్ద వెనక నుంచి అతివేగంగా వచ్చిన కారు( Car) ఢీ కొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించి చికిత్సను అందించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.