శ్రీరాంపూర్, మార్చి 30 : సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని, కార్మికులపై విజిలెన్స్ పేరుతో వేధింపులు మాను కోవాలని, సింగరేణిలోని కుంభకోణాలు, అవినీతి అక్రమాలపై సీబీఐ, సిట్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సో మవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎ దుట టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు ధ ర్నా చేశారు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్ ఆధ్వర్యంలో కార్మికులు, నాయకులు జీఎం ఆఫీస్‌కు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్ర ధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు సమస్యల పరిష్కారం కోసం జీఎం శ్రీనివాస్ కు వినితి పత్రం అందించారు.
సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ పొందే సంస్థగానే చూస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది, భట్టి విక్రమార్కలు సంస్థను వారి జేబు సంస్థలాగా చూస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. వెంటనే మడికల్ బోర్డు ఏర్పాటు చే యాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో 113 మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి, 1391 మం దికి కారుణ్య ఉద్యోగాలు కల్పించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, టీబీజీకేఎస్‌కే దక్కుతుందన్నారు.
కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, టీబీజీకేఎస్ కేంద్ర కార్యదర్శి పానగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్‌రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు వెంకటరమణారెడ్డి, బ్రాంచ్ కార్యదర్శులు మహిపాల్‌రెడ్డి, గొర్ల సంతోష్, బుస్స రమేశ్, గోవిందుల రమేశ్, లాలా, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, పిట్ కార్యదర్శులు దుర్గం రవి, బానోత్ రాజునాయక్, గడ్డం మల్లయ్య, వికాస్, జైపాల్‌రెడ్డి, గోపాల్, వంగ తిరుపతి, రాజ్‌కుమార్, తిరుపతిరావు, వినయ్, బీఆర్ఎస్ నాయకులు ప్ర శాంత్, కాటం రాజు, దేవయ్య, బిరుదు శ్రీనివాస్, తిరుమల్‌రావు, జగదీశ్ తదితరులుఉ పాల్గొన్నారు.