ఎదులాపురం, మార్చి 3 ః ఆదిలాబాద్ పట్టణంలో ఒక వ్యక్తి సోమవారం సాయంత్రం కత్తితో హల్చల్ చేశాడు. స్థిరాస్తి వ్యాపార లావాదేవీల్లో తనకు వాటా కావాలంటూ కత్తితో మరొక భాగస్వామిపై హత్యాయత్నానికి యత్నించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. జయ ప్రకాశ్ జైస్వాల్ భాగ్యనగర్ ప్రాంతాల్లో ఏడాదిన్నర కిందట రెండెకరాల భూమిని కొనుగోలు చేశాడు.
అనంతరం ఖానాపూర్ వాసి ఖలీస్ రంజానీ ఆ భూమి విషయమై రూ.7 లక్షలు జయప్రకాశ్ జైస్వాల్కు వాటా ధనంగా అందించి భాగస్వామ్యం కోరాడు. కొన్ని నెలల కిందట వరకు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో రంజానీ తన వాటాధనం వెనకి తీసుకున్నట్లు బాధితుడు ఫిర్యాదులో పేరొన్నారు. మళ్లీ తనకు వాటా ఇవ్వాలంటూ బాధితుడిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు.
సోమవారం సాయంత్రం జయప్రకాశ్ జైస్వాల్ విద్యానగర్లో ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఉండగా నిందితుడు, అతని కుమారుడు అకడికెళ్లి కత్తితో హంగామా సృష్టించారు. బాధితునిపై దాడి చేయడంతో వేలికి, కడుపులో స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా.. నిందితుడైన ఖలీస్ రంజానీ, అతని కుమారుడు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పేరొన్నారు.
హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను(తండ్రీకొడుకులు) అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె.నాగరాజు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొకలగూడకు చెందిన ఉమర్ ఖలీల్ అలియాస్ ఖలీల్ రంజానీ, వసీం కోకర్ అలియాస్ ఎండీ వసీం కోకర్లను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామని, రెండు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.