నిర్మల్ చైన్గేట్,/నేరడిగొండ, డిసెంబర్ 8 : దీర్ఘకాలిక వ్యాధుల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. వ్యాధుల నివారణే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. ఈ మేరకు కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నాలుగు రోజుల క్రితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చి మంగళవారం నుంచి సర్వేకు శ్రీకారం చుట్టారు. ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. గతంలో ఏడాదికి రెండు సార్లు కుష్ఠుపై సర్వే నిర్వహించే వారు. కరోనా వల్ల ఈ సర్వే చేపట్ట లేదు. సుదీర్ఘ విరామం అనంతరం ఈ సర్వే చేపడుతున్నారు. నిర్మల్ జిల్లాలో 62 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. సర్వేతో వ్యాధిగ్రస్తులకు గుర్తించి ఆదిలోనే చికిత్స చేసే ఆస్కారం ఉంది. సర్వేలో 596 మంది ఆశ కార్యకర్తలు, 155 మంది సూపర్వైజర్లు పాల్గొంటున్నారు. నలుగు రు ఆశ కార్యకర్తలు, ఒక సూపర్వైజర్తో బృం దంగా ఏర్పాటు చేశారు. నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అన్ని గ్రామాలకు గానూ 33 బృందాలు ఏర్పాటు చేశారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ పరీక్షిస్తారు. రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు క్షేత్ర స్థాయికి వెళ్లి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత లక్షణాలు ఉన్న వారిని స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి మరోసారి వైద్యాధికారితో పరీక్ష చేయిస్తారు. గోధుమ, రాగి రంగు మచ్చలు ఉన్న వారు ఆరు నెలలు, అయిదు కంటే ఎక్కువ మచ్చలు ఉన్న వారు ఏడాది పాటు మందులు వాడాల్సి ఉంటుం ది. నెలకు సరిపడా మందులు అందజేయను న్నారు. కుష్ఠు రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం గా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అందజేసింది.వివిధ రకాల వ్యాధులతో బాధపడే వారిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి వారికి సరిపడా మందులు అందిస్తున్నారు. అసంక్రమిత, క్షయ, మలేరియా ఇలా
వివిధ రకాల వ్యాధులు కలిగిన వారికి సైతం ఈ సర్వే ద్వారానే గుర్తించి వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు. కుష్ఠు బాధితులను ప్రతి ఆరు నెలలకోసారి పరీక్షించాల్సి ఉండగా 2019-20లో చివరి సారి ఈ పరీక్షలు జరిగాయి. కరోనాతో రెండేళ్లు నిర్వహించలేదు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేది కావ డంతో ఈ రెండు నెలల వ్యవధిలో ఎంత మందికి సోకిందనే దానిపై సర్వేలో బయటపడ నుంది. ఈ సర్వే ఈ నెల 22 వరకు కొనసాగనుంది.
వ్యాధి సోకిన వారికి పై లక్షణాలు కనపడితే సమీపంలోని ఆరోగ్యకేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధి బహుళ ఔషధ చికిత్స (ఎండీటీ) ద్వారా నయమవుతుంది. వ్యాధి సోకిన వారు చికిత్స ప్రారంభించిన ఆరు నుంచి 12 నెలలలోపు పూర్తిగా నయమ వుతుం ది. చికిత్స తీసుకోవడం ద్వారా అంగవైకల్యం రాకుండా జాగ్రత్తలు తీసుకునే ఆస్కారం ఉంది.
ప్రభుత్వం ఈ నెల 6 నుంచి 22 వరకు జిల్లా వ్యాప్తం గా కుష్ఠు వ్యాధిగ్ర స్తుల గుర్తింపు ఉద్య మం చేపట్టింది. వైద్య సిబ్బంది గ్రామాల్లో, పట్టణాలలో సర్వే చేపడుతున్నారు. ప్రజలు పూర్తిగా సహక రించాలి. వ్యాధి సోకిన వారు ఆందోళన చెంద వద్దు. చికిత్స తీసుకోవడం ద్వారా నయమవు తుంది. తద్వారా ఆరు నుంచి 12 నెలలలోపు నయమవుతుంది. శాశ్వత అంగవైకల్యం కలుగ కుండా ఉంటుంది.
– డా. రవీందర్రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్(నిర్మల్)