బీజింగ్ : మానవుల కన్నా వేగంగా పరుగెత్తే ‘రోబో’ను చైనా శాస్త్రవేత్తలు తయారుచేశారు. వేగానికి మారుపేరైన రన్నర్ ఉసేన్ బోల్ట్ పేరును ఈ రోబోకు పెట్టారు. షాంఘైకి చెందిన రోబోటిక్స్ కంపెనీ ‘మిర్రర్మి టెక్నాలజీ’ దీన్ని తయారుచేసింది. దీని ఎత్తు 5.7 అడుగులు, బరువు 75 కిలోలు. హ్యూమనాయిడ్ తరహాలో.. మానవులను పోలిన కదలికలు కలిగి ఉండటం దీని ప్రత్యేకత.
అయితే ఈ రోబో సెకన్‌కు 10 మీటర్ల వేగంతో మొత్తం 10 సెకన్లలో 100 మీటర్ల దూరం పరుగెత్తుతుందట! ఇదే దూరాన్ని 9.58 సెకన్లలో పూర్తిచేసి బోల్డ్ ఒలింపిక్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయనతో పోల్చితే రోబో స్వల్పంగా వెనుకబడింది. ఈ రోబో డెవలపర్స్ దీని అరంగేట్రం గురించి మాట్లాడుతూ మానవ రూపంలోని రోబోల ఉత్తమ పనితీరులో ఇదొక కీలక మైలురాయి అని తెలిపారు.