న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: గతేడాది హైదరాబాద్‌లో ఎంఆర్వో సెంటర్‌ను ప్రారంభించిన శాఫ్రాన్..ఈ సెంటర్‌ను భారీగా విస్తరించబోతున్నది. ఈ ఏడాది చివర్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ సెంటర్లో 300 మంది ఇంజినీర్లను నియమించుకునే ఆలోచనలో సంస్థ ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ ఎంఆర్వో యూనిట్లో ఎయిర్‌బస్ ఏ320నియో, బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను మరమ్మతులు చేయనున్నారు.
ఇందుకోసం కొత్తగా 60 మంది టెక్నిషియన్లను నియమించుకున్నట్టు ప్రకటించింది. ఈ కేంద్రంలో ఏటా 100 మంది దేశీయ టెక్నిషియన్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ సెంటర్లో 250 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్టు, భవిష్యత్తులో 1,100 మందికి చేరుకోనున్నట్టు కంపెనీ వెల్లడించింది.