ఆదిలాబాద్, జూన్ 8 ( నమస్తే తెలంగాణ) : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, స్థానికులు చెరువుల వద్ద ర్యాలీలు నిర్వహించారు. గంగమ్మతల్లికి పూజలు చేశారు. చెరువుల సమీపంలో సహపం క్తి భోజనాలు చేశారు. మహిళలు బతుకమ్మలతో సందడి చేశా రు. ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తలమడుగు మండలం దేవాపూర్‌లో నిర్వహించి చెరువుల పండుగలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. వ్యవసాయరంగం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలితంగా రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రపంచం తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నదని, ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకాలున్నాయని పేర్కొన్నారు.
నార్నూర్, జూన్ 8 : నీటిరంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. గాదిగూడ మండలం ఝరి, నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామాల్లో దశాబ్ది ఉత్సవాలను నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ నృత్యాలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేసి చెరువులో నిమజ్జనం చేశారు. సీఎం కేసీఆర్ సాగునీరు, వ్యవసాయం, విద్యుత్రంగాలపై తొమ్మిదేళ్ల నుంచి అత్యధికంగా ఖర్చు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాథోడ్ సావీందర్, తహసీల్దార్ ఆర్కా మోతిరామ్, ఏఈఈ ప్రవీణ్‌కుమార్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, మాజీ ఎంపీపీ మెస్రం రూప్‌దేవ్, ఖైరదట్వా సర్పంచ్ కనక ప్రభాకర్, రాయిసెంటర్ జిల్లా సార్మెడీ మెస్రం దుర్గుపటేల్, పంచాయతీ కార్యదర్శి లవ్‌కుమార్, నాయకులు, కార్యకర్తలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 8 : మిషన్ కాకతీయ పథకం ద్వారా ప్రభుత్వం చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చిందని కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావల మండలకేంద్రంలో ఘనంగా ఊరూరా చెరువుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే గ్రామస్తులతో కలిసి బోనాలు, బతుకమ్మలతో చెరువు కట్టకు ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన రాష్ట్రంలో నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామని తెలిపారు. అనంతరం సభా ప్రాంగణ ఆవరణలో మహిళలతో కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావ్, జడ్పీటీసీ వనిత, ఎంపీపీ సంగీత, సర్పంచ్ ప్రమీల- రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 8 : ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే గ్రామీణ ప్రాంతంలోని రైతులు వ్యవసాయంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి చెందారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని 28 గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్‌లతోపాటు మండల ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. మండలంలోని ముత్నూర్ త్రివేణి సంఘం ప్రాజెక్టు వద్ద ఏ ర్పాటు చేసిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మైసమ్మ విగ్రహానికి పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కాగా, చెరువుల వద్ద మహిళా ప్రజాప్రతినిధులు బతుకమ్మ ఆడిపాడారు. ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ వాయిద్యాలతో గ్రామాల్లో భారీ శోభాయాత్రలు నిర్వహించారు. అక్కడే ప్రత్యేక వంటలు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్ డోంగ్రే, జడ్పీ కోఆప్షన్ స భ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, బీఆర్ఎస్ మండల కోఆర్డినేటర్ షేక్ సుఫియాన్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో సంతోష్‌కుమార్, ఎస్ఐ డీ సునీల్, ఈవో సంజీవరావ్, నాయకులు పాల్గొన్నారు.