1950
అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు అవసరమైన వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించింది.
- కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది
- ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు
- ఓటరు వివరాలు, ప్రలోభాలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్
అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు అవసరమైన వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించింది. కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నంబరు 1950ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే ఫిర్యాదులు కూడా స్వీకరించనున్నది. కంట్రోల్ రూంలో సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తారు. ఎన్నికలు ముగిసేంత వరకు కంట్రోల్ రూం ఓటర్లకు అందుబాటులో ఉంటోంది.
– ఆదిలాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ)
ముగిసిన శ్రామనేర్ బౌద్ధ ఆచార్య శిబిరం
ఎదులాపురం, అక్టోబర్ 19: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ బుద్ధ విహార్‌లో నిర్వహిస్తున్న శ్రామనేర్ బౌద్ధ ఆచార్య శిబిరం గురువారంతో ముగిసింది. భారతీ య బౌద్ద మహాసభ జిల్లా శాఖ ఆధ్వర్యం లో ఈ శిబిరం నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బంతే షీ ల్ రత్న, బంతే బోధి హాజరయ్యారు. ముందుగా గౌతమ బుద్ధుడు, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి, జ్యోతి ప్ర జ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో బౌద్ద మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ , ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞాకుమా ర్, ఉపాధ్యక్షుడు అబ్బారావు, జిల్లా అధ్య క్షుడు దయానంద్, కాంతారావు, జితేంద ర్, గంగారం, రాజు తదితరులున్నారు.

ఆదిలాబాద్, అక్టోబరు 19 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నా యి. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకునేందు కు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఓటు వినియోగం పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 4న ఓటరు తుదిజాబితా విడుదల చేయగా, అక్టోబరు 30 వరకు ప్రజలు తమ ఓటును న మోదు చేసుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది. ప్రజలు తమ ఓటు జాబితాలో ఉందా, లేకపోతే ఏమి చేయాలి, ఎవరిని సంప్రదించాలి, వారి ఫోన్ నంబరు, పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, ఇతర వివరాలు తెలుసుకేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ఈ సహాయ కేంద్రం ద్వారా ప్రజలకు పలు రకాల సేవలు అందుతాయి.
1950 ఫిర్యాదు చేయవచ్చు..
ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో ఓటర్ల సమస్యల పరిష్కారం కోసం అధికారులు 1950 టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలు తమ వివరాలతో పాటు అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. కంట్రోల్ రూంలో సిబ్బంది మూడు షిప్టుల్లో 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారు. ప్రతి షిప్టులో నలుగురు సిబ్బంది ఉంటారు. 1950 ఫోన్ చేయగానే వారి సమస్యలు తెలుసుకుంటారు. ఫోన్ చేసిన వారి వివరాలను రిజిష్టర్‌లో న మోదు చేసుకుని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి తగిన చర్య లు తీసుకుంటారు. కంట్రోల్ రూంలో ఫోన్ ఎవరూ తీయకపోతే కాల్ నేరుగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు కనెక్ట్ అవుతుంది. జిల్లాలో రెండు నియోజకవర్గాల పోలింగ్ నవంబరు 30న జరగనుండగా అప్పటి వరకు ప్రజలకు కంట్రోల్ రూం ద్వారా సేవలు అందుబాటులో ఉంటాయి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

