నార్నూర్ : విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సర్పంచ్ మడవి తానాజీ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి బి గ్రామంలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలలో అక్షర అభ్యాసం ( Akshara Abhyasam ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు, తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఫ్రీ ప్రైమరీ పాఠశాలలో పిల్లలను చేర్పించారు.
సర్పంచ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను బాధ్యతగా పాఠశాలకు పంపించాలన్నారు. పిల్లలు చదువుతోనే భవిష్యత్తులో ప్రయోజకులుగా ఎదుగుతారని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కలను సంరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆనంద్, ఉప సర్పంచ్ సత్యపాల్, ప్రధానోపాధ్యాయుడు జాకు, పాఠశాల చైర్మన్ రత్న మాల, వార్డ్ సభ్యులు జ్యోతి రామ్, అంగన్వాడీ టీచర్ జయశ్రీ, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.