బోథ్, డిసెంబర్ 1: బోథ్ నియోజకవర్గ పరిధిలో గురువారం నిర్వహించిన శాసనసభ ఎన్నికల పోలింగ్ 82.86 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాహత్‌బాజ్‌పాయ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. తొమ్మిది మండలాల పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాలకు గాను 2,08,048 మంది ఓటర్లకు గాను 1,72,397 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 85,028 మంది పురుషులు, 87,369 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇచ్చోడ మండలం బాబ్జీపేట్ 177 పోలింగ్ కేంద్రంలో వంద శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 370 మంది ఓటర్లకు గాను 170 మంది పురుషులు, 200 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బోథ్ నియోజకవర్గ కేంద్రంలో 73 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ 8461 మంది ఓటర్లకు గాను పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4049 మంది పురుషులకు గాను 2974 మంది, 4412 మంది మహిళలకు గాను 3219 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 249 పోలింగ్ కేంద్రంలో 827కు గాను 585, 250లో 635కు గాను 478, 251లో 849కు గాను 595, 252లో 705కు గాను 555, 253లో 937కు గాను 683, 254లో 848కు గాను 600, 255లో 975కు గాను 688, 257లో 1143కు గాను 803, 258లో 687కు గాను 514, 259లో 855కు గాను 689 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బోథ్ నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది మండలాల వారీగా పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. భీంపూర్ మండలంలో 28 పోలింగ్ కేంద్రాలకు గాను 18,932 మంది ఓటర్లకు గాను 15,622 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తాంసి మండలంలో 17 పోలింగ్ కేంద్రాలకు గాను 13,525 మంది ఓటర్లకు గాను 11,566, తలమడుగు మండలంలో 43 పోలింగ్ కేంద్రాలకు గాను 27,003 మంది ఓటర్లకు గాను 23,813, గుడిహత్నూర్‌లో 36 పోలింగ్ కేంద్రాలకు గాను 24,379 మంది ఓటర్లకు గాను 20,144.
ఇచ్చోడలో 48 పోలింగ్ కేంద్రాలకు గాను 33,989 మంది ఓటర్లకు గాను 27,789, సిరికొండలో 9 పోలింగ్ కేంద్రాలకు గాను 6,925 మంది ఓటర్లకు గాను 6,020, బజార్హత్నూర్లో 37 పోలింగ్ కేంద్రాలకు గాను 23,178 మంది ఓటర్లకు గాను 18,351, బోథ్‌లో 49 పోలింగ్ కేంద్రాలకు గాను 37015 మంది ఓటర్లకు గాను 29,717, నేరడిగొండ మండలంలో 35 పోలింగ్ కేంద్రాలకు గాను 23,102 మంది ఓటర్లకు గాను 19,366 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది మండలాల్లో 302 పోలింగ్ కేంద్రాల్లో 2,08,048 ఓటర్లకు గాను 1,72,397 మంది ఓట్లు వేశారు.