శ్రీరాంపూర్, సెప్టెంబర్ 26 : సింగరేణికి వచ్చిన వా స్తవ లాభాల నుంచి కార్మికులకు 33 శాతం వాటా కార్మికులకు ఇవ్వాల్సిందేనని టీబీజీకేఎస్ నాయకులు డి మాండ్ చేశారు. ఈ మేరకు గురువారం గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై సంతకాల సేకరణ చేపట్టారు. శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ-1, -3, ఆర్కే-5, ఆర్కే న్యూటె క్, ఆర్కే-7 గనులతో పాటు ఎస్ఆర్పీ ఓసీపీపై కార్మికు ల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు.
ఆయా చోట్ల ఉ పాధ్యక్షుడు పెట్టం లక్షణ్, కేంద్ర, స్థానిక నాయకులు, ఇన్చార్జిలు రవిచంద్ర, వికాస్, మెడం తిరుపతి, మారం శ్రీనివాస్, సాధుల భాస్కర్, తౌటి సురేష్, వెంకట్‌రెడ్డి, గంగాధర్, సాల్మన్, సిరాజ్పాషా, గోపీనాయక్, దుర్గం రవి, జాడి శ్రీనివాస్, పాపిరెడ్డి, రమేశ్, ఎండా లాలా, ఉప్పాల సంపత్, గడ్డం సుధాకర్, సారయ్య, రమేశ్, అన్వేష్‌రెడ్డి, రమేశ్, గొర్ల సంతోష్, రాజునాయక్, బిరుదు శ్రీనివాస్ కార్మికుల వద్ద సంతకాలు సేకరించారు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నికర లాభాలు రూ.4701 కోట్లు ప్రకటించి, కార్మికులకు వాటా తక్కువ చూపి కేవ లం 16.9 శాతం రూ.796 కోట్లు మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
కాసిపేట గనిపై..
కాసిపేట, సెప్టెంబర్ 26 : మందమర్రి ఏరియాలోని కాసిపేట ఒకటో గనిపై గురువారం టీబీజీకేఎస్ ఆధ్వర్య లో కార్మికులు సంతకాల సేకరణ చేపట్టారు. నాయకు లు మాట్లాడుతూ కార్మికుల సంతకాల సేకరణ చేసి స్థా నిక ఎమ్మెల్యేకు వినతిపత్రం అందిస్తామన్నారు. టీబీజీకేఎస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వొడ్నాల రాజన్న, సెంట్రల్ కమిటీ సభ్యుడు బెల్లం అశోక్, పిట్ సెక్రటరీ బైరి శంకర్, అఫ్జలుద్దీన్, బండారి రమేశ్, రవి కాంత్, సతీశ్, సంపత్, వెంకటస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మందమర్రిలో..
మందమర్రి, సెప్టెంబర్ 26 : మందమర్రి ఏరియాలోని కేకే -5 గనిపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర, ఏరియా నాయకులు జే.రవీందర్, మేడిపల్లి సంపత్, ఓ.రాజశేఖర్, ఈశ్వర్, సీపెల్లి రాజలింగు, బెల్లం అశోక్ పాల్గొన్నారు.