
వివిధ రాష్ర్టాల నుంచి వేలాదిగా తరలిరానున్న ఆదివాసులు
విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు
గోదావరిలో పుణ్యస్నానాలు, ప్రత్యేక పూజలు
దండేపల్లి, అక్టోబర్ 30 : దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో ఉన్న పద్మల్‌పురి కాకో ఆలయంలో దండారీ ఉత్సవాల్లో భాగంగా నేడు గుస్సాడీ దర్బార్ నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లపై ఆలయ కమిటీ చైర్మన్ సోము, సభ్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ర్టాల నుంచి భక్తులు తరలిరానున్నారు. గుస్సాడీ దర్బార్‌లో భాగంగా ఆదివాసీల గుస్సాడీ నృత్యాలు ఆకట్టుకోనున్నాయి. ఆలయంలో నూతనంగా కాకో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు.
కాకో ఆలయంలో భక్తుల సందడి
పద్మల్‌పురి కాకో ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. దర్బార్‌కు ఒక రోజు ముందే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి జలాలను కాకో వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కానుగ నూనెలో తయారుచేసిన గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అనం తరం సామూహికంగా విందు భోజనాలు ఆరగించారు.