
సీఐ ప్రవీణ్ కుమార్
పలు గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవం
చెన్నూర్ రూరల్, అక్టోబర్ 30: కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాల వారితో సోదరాభావంతో మెలగాలని చెన్నూర్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మండలంలోని అక్కేపల్లి గ్రామపంచాయతీలోని శివలింగాపూర్లో చెన్నూర్ పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. కుల విభేదాలు లేకుండా ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టాలని, మూఢనమ్మకాలను వీడాలని తెలిపారు. గంజాయి, గుట్కా అమ్మకాలు ప్రభు త్వం నిషేధించిందని, వాటిని విక్రయించేవారిపై పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, రెవన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి, పంచాయతీ సెక్రటరీ ధర్ని సతీశ్, నాయకులు పెద్దింటి రాజన్న, మేకల సంపత్ తదితరులున్నారు.
చంద్రపల్లి గ్రామంలో..
తాండూర్, అక్టోబర్ 30 : తాండూర్ మండలం కాసిపేట గ్రామపంచాయతీ పరిధిలోని చంద్రపల్లిలో శనివారం సర్పంచ్ అస్ప రమేశ్ అధ్యక్షతన తహసీల్దార్ కవిత పౌరహక్కుల దినోత్సవం నిర్వహించి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులస్తులను సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలను కింద పరిచే విధంగా మాట్లాడవద్దని తెలిపారు. అంటరానితనాన్ని రూపుమాపాలని, ఈ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులున్నారు.
దండేపల్లిలో..
దండేపల్లి, అక్టోబర్ 30: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహ న కలిగి ఉండాలని ఎస్ఐ శ్రీకాంత్ సూచించారు. మండలంలోని ద్వారకలో శనివారం జరిగిన సివిల్ రైట్స్డే కార్యక్రమంలో మాట్లాడారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సమస్యలపై స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కర్నాల గీత, ఎంపీటీసీ మణెమ్మ, డీటీ అంజలి, పీఎస్ఐ శివ, నాయకులు పడిగెల శంకర్రావు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, వార్డు సభ్యులు ఉన్నారు.
మహాలక్ష్మీవాడలో..
లక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 30: లక్షెట్టిపేట పట్టణంలోని మహాలక్ష్మీవాడలో సివిల్ రైట్స్ డేను నిర్వహించారు. లక్షెట్టిపేట గిర్దావర్ సమ్మక్క పాల్గొని మాట్లాడారు. ఇతరుల హక్కుల భంగం వాటిల్లకుండా మెలగాలన్నారు. పిల్లలను చదివించాలని, సన్మార్గంలో నడిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ గ్రామస్తులు పాల్గొన్నారు.