
ఎదులాపురం,అక్టోబర్30: ఐటీడీఏ చైర్మన్‌గా నియమితులైన కనక లక్కేరావును జిల్లా కేంద్రంలో శనివారం సన్మానించారు. జడ్పీ చైర్మన్ ఛాంబర్లో చైర్మన్ జనార్దన్ రాథోడ్, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి రాజు, జడ్పీటీసీలు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు సుధాకర్, అనిల్ జాదవ్, గోక గణేశ్ రెడ్డి, మల్లెపూల నర్సయ్య, చారులత, ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు తుల శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుడు అంజద్, నాయకుడు సూఫియాన్ పాల్గొన్నారు.
బోథ్, అక్టోబర్ 30: ఉట్నూర్ ఐటీడీఏ పాలకవర్గం చైర్మన్‌గా నియమితులైన కనక లక్కేరావును ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ శనివారం సన్మానించారు. ఆదిలాబాద్‌లో చైర్మన్‌తో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్‌ను సత్కరించారు. ఆదివాసుల సమస్యలు గుర్తించి ఐటీడీఏ ద్వారా పథకాలు వర్తింప చేయాలని కోరారు. సన్మానించిన వారిలో నేరడిగొండ, తాంసి జడ్పీటీసీలు జాదవ్ అనిల్, గంగాధర్‌రావు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, కే చంద్రమోహన్, ఏ మహిపాల్ ఉన్నారు.
ఉట్నూర్, అక్టోబర్29: ఉట్నూర్ ఐటీడీఏకు రెండోసారి చైర్మన్‌గా నియమితులైన కనక లక్కేరావును శనివారం ఆయన నివాసంలో ఎంపీపీ పంద్రజైవంత్‌రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండోసారి చైర్మన్‌గా కనక లక్కేరావు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ ఎస్పీ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రషీద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కందుకూరి రమేశ్, నాయకులు శ్రీరాంనాయక్, దాసండ్ల ప్రభాకర్, సర్పంచ్ హరినాయక్, మాజీ మండల అధ్యక్షుడు భరత్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అహ్మద్ అజీమొద్దీన్, కోల సత్యం, కామెరి పోషన్న, కేంద్రే రమేశ్, కాటం రమేశ్, ధరణి రాజేశ్, రాజ్‌కుమార్, భూమన్న, భుజంగ్‌రావు, అన్సారి, సతీశ్, కార్యకర్తలు ఉన్నారు.
ఇంద్రవెల్లి, అక్టోబర్30 : ఉట్నూర్ ఐటీడీఏ చైర్మన్‌గా రెండోసారి నియమితులైన కనక లక్కేరావ్ని ఇంద్రవెల్లి పీఏసీఎస్ పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే, టీఆర్ఎస్ నాయకులు దేవ్‌పూజె మారుతి, కోరెంగా సుంకట్రావ్ శనివారం సన్మానించారు. ఉట్నూర్‌లోని నివాసంలో కనక లక్కేరావ్ని మర్యాద పుర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. కార్యక్రమంలో నాయకులు మహేశ్ కదం, వికాస్, కృష్ణ పాల్గొన్నారు. లక్కేరావ్ని బీఎస్పీ మండలాధ్యక్షుడు మీర్జా ఆరీఫ్బేగ్తో పాటు స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి సోన్కాంబ్లే వికాస్, ఉపాధ్యక్షుడు బోడ్కే దళితానంద్, నాయకులు ఆచార్య దత్తా, గైక్వాడ్ బాబాసాహెబ్ సన్మానించారు.
ఐటీడీఏ డైరెక్టర్‌కు సన్మానం
నార్నూర్, అక్టోబర్ 30: ఐటీడీఏ డైరెక్టర్‌గా నియమితులైన మడావి మాన్కును మండలం కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్ మాట్లాడారు. కష్టపడి పని చేసే వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాయిసిడాం రూప్‌దేవ్, టీఆర్ఎస్ నాయకుడు కొరెల మహేందర్ ఉన్నారు.