
పాల్గొన్న జడ్పీచైర్మన్, ఎమ్మెల్యేలు
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 30: జిల్లా కేంద్రంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. రాంపూర్ రోడ్డులో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గోపాలకృష్ణ మఠంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పూజలు నిర్వహించారు. వినాయక్ చౌక్‌లోని మురళీకృష్ణ ఆలయంలో స్వామి సుందర చైతన్య భక్తులు వేడుకలు జరిపారు. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే వారితో ఉట్టి కొట్టించారు.
భక్తిమార్గంలో నడవాలి
తాంసి, ఆగస్టు 30: ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో నడిచినప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. పొన్నారిలోని మురళీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ ముచ్చ రేఖ రఘు, మాజీ ఎంపీటీసీలు రమణ, విలాస్, మాజీ సర్పంచ్ భోజన్న యాదవ్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేశ్, కమిటీ అధ్యక్షుడు సుభాష్, మల్లయ్య, మహేందర్, రాజేశ్వర్, విలాస్, తదితరులు పాల్గొన్నారు.
తలమడుగు, ఆగస్టు 30: సుంకిడిలోని కృష్ణాలయంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని పలు వీధుల గుండా రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్ యాదవ్, ఎంపీటీసీ గౌరమ్మ, ఆలయ కమిటీ అధ్యక్షుడు విలాస్, సభ్యులు ఆశన్నయాదవ్, మల్లేశ్, పొచ్చన్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ, ఆగస్టు 30: మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద యువకులు శ్రీ కృష్ణుని చిత్రపటానికి పూజలు చేశారు. కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ ఎలేటి రవీందర్‌రెడ్డి, యువకులు సంతోష్‌సింగ్, రాథోడ్ రాజశేఖర్, నారాయణస్వామి, సంతోష్‌గౌడ్ పాల్గొన్నారు.
బోథ్, ఆగస్టు 30: మండలంలోని గుట్టపక్కతండా, గుర్రాలతండా, రాంనగర్, కృష్ణానగర్, డెమ్మి, సంపత్నాయక్తండా, మథురతండాల్లో మహిళలు పొలాలకు వెళ్లి మట్టిని తీసుకు వచ్చారు. బావుల నీటిని బిందెల్లో ఇంటింటికీ పట్టుకువచ్చారు. మట్టితో కృష్ణుని (కన్నయ్య) ప్రతిమలు తయారు చేశారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో తయారు చేసిన ప్రతిమలకు పూజలు నిర్వహించారు. పిండి వంటలు వండి నైవేద్యాలు సమర్పించారు.
ఉట్నూర్, ఆగస్టు 30: మండల కేంద్రంలో సతీశ్ టైలర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉట్టి కార్యక్రమాన్ని సీఐ సైదారావు ప్రారంభించారు. మండలంలోని యువకులు బృందాలుగా ఏర్పడి ఉట్టి కొట్టేందుకు పోటీపడ్డారు. కొమ్ముగూడకు చెందిన సురేందర్‌నాయక్ బృందం రూ.5వేలు నగదు బహుమతి గెలుచుకున్నారు.