ఎదులాపురం, జూన్ 10 : ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 300 నూతన సీసీ టీవీ కెమెరాలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ప్రా రంభించారు. బుధవారం స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో కెమెరాల వ్యవస్థను ప్రారంభించి, పర్యవేక్షణ సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాంగణంలో మొకనాటి పచ్చదనం ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్ర మంలో చారు సిన్హా , ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ(అడ్మిన్) పి.మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సీఐ బి.సునీల్‌కుమార్ పాల్గొన్నారు.
ట్రాఫిక్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, సిగ్నల్స్ ప్రారంభం
ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించిన డీజీపీ, శిక్షణ పూర్తి చేసిన 30 మంది డ్రైవర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం పోలీసు క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో కార్ హైడ్రాలిక్స్ వ్యవస్థను ప్రారంభించారు. అలాగే కుమ్రం భీమ్ చౌరస్తా వద్ద నూతన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.
గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై అవగాహన
గుడిహత్నూర్, జూన్ 10 : గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై అవగాహన పెరగాలని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 మంది ఆటో డ్రైవర్లకు ప్రథమ చికిత్స కిట్లు.. గ్రామసభలో 200 మందికి హెల్మెట్లు.. యువతకు వాలీబాల్ కిట్లు.. డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో పాల్గొన్న 75 మంది యువతకు లర్నింగ్ లైసెన్స్ అందజేశారు.