
వ్యాక్సినేషన్‌తో సత్ఫలితాలు ఇప్పటికే 75 శాతం పూర్తి
అయినా నిర్లక్ష్యం వద్దంటున్న నిపుణులు
ఆదిలాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా కట్టడికి సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా వ్యాక్సినేషన్ చేపడుతుండగా, ఇప్పటికే 75 శాతం పంపిణీ పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. టీకాతో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతుండగా, ఈ ఐదారు రోజుల్లో ఒక్కటీ నమోదు కాలేదు. పూర్వ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ఏమ్రాతం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
కొవిడ్ నివారణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ప్రజలు తమ రోజువారీ పనులు యథావిధిగా చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలే దు. కొన్ని రోజులుగా కరోనా మునుపటి పరిస్థితులు నెలకొన్నాయి. విద్యాసంస్థలు పూర్తిగా తెరుచుకోగా పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. వ్యాపా ర సంస్థలు, సినిమాహాళ్లు, ఆలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ప్రజలు వివాహాలతో పాటు ఇతర శుభకార్యాల కు ఎక్కువగా హాజరువుతున్నారు. పండుగల సందర్భంగా మా ర్కెట్లు, బట్టల దుకాణాల్లో రద్దీ పెరిగింది. ఉమ్మడి జి ల్లా నుంచి మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ఆర్టీ సీ బస్సులు నడుస్తున్నాయి. రైళ్ల రాకపోకలు సైతం యథావిధిగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజలు కరోనా పరిస్థితుల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నారు.
నిర్లక్ష్యం వీడాలి..
కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 80 శాతం మంది మాస్కులు ధరించడం లేదు. భౌతికదూరం పాటించకపోవడంతోపాటు చేతులు శుభ్రపర్చుకోవడం మానేశారు. కరోనా ఇంకా తగ్గలేదని, ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో థర్డ్‌వేవ్‌తో చాలా మంది చనిపోతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అనుమానితులతో పాటు లక్షణాలతో దవాఖానలకు వచ్చే వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 17,46,726 మందికి..
ఉమ్మడి జిల్లాలో టీకా పంపిణీ జోరుగా సాగుతున్నది. ప్ర భుత్వం 18 సంవత్సరాల వారికి వ్యాక్సిన్ వేస్తున్నది. అర్హులందరూ టీకా తీసుకునేలా అధికారులు పకడ్బందీ ప్రణాళికలు తయారు చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ టీకా ఇస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
ఇంటింటా తిరుగుతూ..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైద్యబృందాలు ఇంటింటా తిరుగుతూ వివరాలు సేకరించి అర్హులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కొవిన్ యాప్‌లో వారి వివరాలు నమోదు చేస్తున్నారు. ఉ మ్మడి జిల్లాలో 17,46,726 మందికి టీకా వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 2,92,424 మందికి కరోనా వ్యాక్సిన్ వేయ గా.. ఇందులో 2,46,876 మందికి మొదటి డోస్, 45,558 మందికి రెండో డోస్ వేశారు. నిర్మల్ జిల్లాలో 5,18,918 మందికి టీకా వేశారు. ఇందులో 3,85,731 మందికి మొదటి డోస్, 1,33,187 మందికి రెండో డోస్ వేశారు. మంచిర్యాల జిల్లాలో 6,10,442 మందికి టీకా వేయగా.. ఇందులో 4,54,579 మందికి ఫస్ట్‌డోస్, 1,55,863 మందికి రెండోడోస్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 3,27,942 మందికి వ్యాక్సిన్ వేయగా.. 2,76,888 మందికి ఫస్ట్‌డోస్, 51,054 మందికి సెకండ్‌డోస్ వేశారు.