
భూపాలపల్లి, అక్టోబర్ 29 : రాష్ట్రం, రాష్ర్టేతర సిమెంట్ పరిశ్రమలకు భూపాలపల్లి ఏరియా నుంచి లారీల ద్వారా బొగ్గు రవాణా అవుతుంది. డీజిల్ ధరల పెరుగుదలకు అనుగుణంగా కిరాయిలు పెంచాలని ‘ది కాకతీయఖని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసొసియేషన్’ ఆధ్వర్యంలో భూపాలపల్లికి చెందిన లారీ యజమానులు బొగ్గు రవాణా చేయకుండా కొన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నా రు. భూపాలపల్లి ఏరియా బొగ్గు గనుల నుంచి రోజుకు ఒక్కంటికి 6500 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాగుతున్నది. ఈ 6500 టన్నుల బొగ్గును మొ త్తంగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు చె ల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ)కు టిప్పర్ల ద్వారా యథావిధిగా రవాణా చేస్తున్నారు. లారీ యజమానుల సమ్మెతో బొగ్గు రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేవని భూపాలపల్లి ఏ రియా సింగరేణి ఎస్వోటూ జీఎం విజయప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు 500 నుంచి 600 టన్నుల వరకు లారీల ద్వారా రాష్ట్రం, రాష్ర్టేతర సిమెంట్ పరిశ్రమలకు పర్మిట్‌పై భూపాలపల్లి ఏరియా నుంచి బొగ్గు రవాణా జరిగేది. డీజిల్ ధరలు పెరిగిన మూలంగా టన్ను ఒ క్కంటికి మరో రూ.400 కిరాయి పెంచాలని లారీ యజమానులు సమ్మెకు దిగారు. ది కాకతీయఖని కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు, లా రీ ఓనర్స్ అసోసియేషన్ నాయకుల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ అవి విఫలమయ్యాయి. శుక్రవారం భూపాలపల్లి డీఎస్పీ సంప త్ రావు ఆధ్వర్యంలో ఇరువర్గాల మధ్య మళ్లీ చర్చలు సాగాయి. ఇందులో కొద్దోగొప్పో పురోగతి వచ్చినప్పటికీ పూర్తిగా సమస్య పరిష్కారం కాలేదు. రూ.400 టన్ను ఒక్కంటికి కిరాయి పెంచాలని లారీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేస్తుండగా, కోల్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ నాయకులు మాత్రం రూ.70 కిరాయి పెంచుతామని చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. నేడు (శనివారం) భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో చర్చలున్నాయని లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రోడ్డ రవీందర్ తెలిపారు.