
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్‌గౌడ్
బోథ్‌లో టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సమావేశం
భారీ సంఖ్యలో తరలిరావాలి : ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
బోథ్, అక్టోబర్ 29:రాష్ట్ర సర్కారు సాధించిన ప్రగతిని నివేదించేందుకే వరంగల్‌లో నవంబర్ 15న విజయగర్జన సభ ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లలో సాధించిన ప్రగతిని నివేదించడానికే వరంగల్‌లో విజయగర్జన సభ ఏర్పాటు చేసినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం బోథ్ మండలం పొచ్చెర సాయి కాన్ఫరెన్స్ హాల్లో టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సమావేశం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ… 70 ఏండ్ల పాలనలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏడేళ్లలో సాధించామన్నారు. పక్క రాష్ట్రంలో అభివృద్ధి జరిగి ఉంటే అక్కడివారు తెలంగాణలో కలుస్తామని ఎందుకంటారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి, ముగ్గురు ఎంపీలున్న బీజేపీ రాష్ర్టానికి ఏమి తెచ్చిందో ప్రజలకు వివరించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పథకాలను ప్రవేశ పెట్టిందో ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. జాతీయ పార్టీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, మరో ఇరవై ఏండ్లు టీఆర్ఎస్దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ విజయగర్జనకు ప్రతి కార్యకర్త, నాయకుడు తరలిరావాలన్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి పథకం కోసం 18,932 దరఖాస్తులు రాగా 14,228 మందికి రూ. 124 కోట్లు ప్రభుత్వం అందించిందన్నారు. విజయగర్జన సభ కోసం తొమ్మిది మండలాల పరిధిలోని 229 గ్రామ పంచాయతీలకు బస్సులు కేటాయిస్తున్నామని చెప్పారు. సమావేశంలో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, పార్టీ మండల కన్వీనర్ ఎస్ రుక్మణ్‌సింగ్, జడ్పీటీసీ డాక్టర్ ఆర్ సంధ్యారాణి, సర్పంచ్ సురేందర్‌యాదవ్, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, ఆత్మ చైర్మన్ సుభాష్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ, మండల కమిటీలు, అనుబంధ కమిటీలు, ఆత్మ, ఏఎంసీ చైర్మన్లు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.