
గుడిహత్నూర్,అక్టోబర్29 : బోథ్‌లో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు తరలివెళ్లారు. ముందుగా మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. నవంబర్15న విజయగర్జన సభ నిర్వహించనున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు బోథ్‌లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ర్యాలీలో టీఆర్ఎస్ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భీంపూర్, అక్టోబర్29: బోథ్ మండలం పొచ్చెరలో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి మండల నాయకులు,ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా హాజరయ్యారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్యయాదవ్ ఆధ్వర్యంలో 26 పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీల బాధ్యులు సమన్వయంగా ఉదయం భీంపూర్ నుంచి సమావేశానికి బయలుదేరి వెళ్లారు. టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి ఉత్తంరాథోడ్, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీపీ కుడిమెత రత్నప్రభ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచులు పెండెపు కృష్ణయాదవ్, లింబాజీ, హనుమద్దాసు, నాయకులు జి.నరేందర్‌యాదవ్, కపిల్, అనిల్, ఎం కల్చాప్యాదవ్, వైభవ్, కార్యకర్తలు హాజరయ్యారు.
వరంగల్ సభకు సమాయత్తం కావాలి
నవంబర్ 15న వరంగల్‌లో నిర్వహించనున్న టీఆర్ఎస్ విజయగర్జన సభకు తాంసి, భీంపూర్ మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరావాలని జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి రాజు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. సభను విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళిక వేసుకోవాలన్నారు. బోథ్ మండలం పొచ్చెరలో నిర్వహించిన సమావేశం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపిందని పేర్కొన్నారు. విజయ గర్జన సభ కోసం ప్రతి పంచాయతీకో బస్సు కేటాయిస్తారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అందరినీ సమన్వయం చేసుకుంటూ తరలిరావాలని సూచించారు.