
కొత్తగూడెం సింగరేణి, అక్టోబర్ 29: దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, సుస్థిరమైన అభివృద్ధి సాధించడంలో మైనింగ్ రంగానికి కీలక పాత్ర అని, ముఖ్యంగా తయారీ రంగానికి (మ్యాన్ ఫ్యాక్చరింగ్ సెక్టార్) అవసరమైన 12 అతి కీలకమైన ఖనిజాలతో ప్రపంచంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలపడానికి అవకాశం ఉందని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ రీజినల్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్ శైలేంద్రకుమార్ అన్నారు. మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని రాయల్టన్ హోటల్లో ‘రోల్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఇన్ నేషనల్ డెవలప్మెంట్’ అంశంపై నిర్వహించిన జాతీ య సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడా రు. అధునాతన సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఫోన్లు, ప్లాట్ స్క్రీన్స్, డిఫెన్స్, ఆటోమొబైల్స్, మెడికల్ ఇమేజింగ్, టెలివిజన్స్ లాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో ఈ క్రిటికల్ మినరల్స్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ ఖనిజాల అన్వేష ణ, ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా అగ్రస్థానంలో నిలవడం వల్లే అక్కడ తయారీ రంగంలో గణనీయమైన పురోగతి సా ధ్యమవుతుందని చెప్పారు. బెరీలియం, జర్మేనియం, రీని యం, టంటాలమ్, అరుదైన భూ ఖనిజ వనరులు (రేర్ ఎర్త్ మినరల్స్) లాంటివి ప్రస్తుతం ప్రపంచ తయారీ రంగానికి కీలకంగా ఉపయోగపడుతున్నాయని, వీటిని మన దేశంలోనూ గుర్తించి ఉత్పత్తి చేయగలిగితే రానున్న దశాబ్ద కా లంలో గణనీయమైన పురోగతి సాధించగలుగుతామన్నా రు. మంచి అంశంపై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్న మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. కార్యక్రమంలో మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మధుసూదన్, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ సుశీల్‌కుమార్, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనర ల్ డాక్టర్ హరి సర్వోత్తమన్ పాల్గొన్నారు. అనంతరం ఎంఈఏఐ హైదరాబాద్ చాప్టర్ రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరించారు.
‘సోలార్’లోనూ ముందడుగు : డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్
బొగ్గు ఉత్పత్తి ద్వారా తెలంగాణలో ఇంధన అవసరాలు తీర్చడంలో సింగరేణి ముఖ్య భూమిక పోషిస్తోందని డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ అన్నారు. జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. సంప్రదా య ఇంధన వనరుల ద్వారా విద్యుత్ అవసరాలు తీర్చడమే కాకుండా సోలార్ విద్యుత్ ఉత్పత్తిలోనూ ముందడుగు వేశామన్నారు. ఎంఈఏఐ మాజీ అధ్యక్షుడు సంజయ్ పట్నాయ క్, ఏఎండీ మాజీ అధిపతి డాక్టర్ యమునా సింగ్, ఎంఈఏఐ సెక్రటరీ జనరల్ నర్సయ్య ప్రసంగించారు. సెయంట్ లిమిటెడ్‌కు చెందిన రమేశ్చంద్ర, ఫణి, హైదరాబాద్ చాప్టర్ సభ్యులు, ఎంఈఏఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. ఆన్లైన్ ద్వారా సుమారు 300 మంది ఎంఈఏఐ సభ్యులు, ఇంజినీర్లు, మైనింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.