
ఇంద్రవెల్లి, సెప్టెంబర్29 : రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. దస్నాపూర్‌కు చెందిన నీలాబాయికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 20వేలు మంజూరు కాగా, ఇంద్రవెల్లి పంచాయతీ కార్యాలయంలో బుధవారం చెక్కు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, కోవ రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్‌రావ్, టీఆర్ఎస్ నాయకులు దేవ్‌పూజె మారుతి, షేక్ సూఫియాన్, కోరెంగా సుంకట్రావ్, వసంత్‌రావ్, శ్రీరాంనాయక్, శ్రీనివాస్, కేశవ్, హరిదాస్, పాల్గొన్నారు. సమక గ్రామానికి చెందిన కోరెంగా ఫక్రు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ పరామర్శించారు.
మదర్సా భవన నిర్మాణానికి భూమిపూజ
ఉట్నూర్, సెప్టెంబర్29: మండల కేంద్రంలోని ఎన్టీఆర్నగర్లో మదర్సా భవన నిర్మాణానికి ఎమ్మెల్యే రేఖానాయక్ బుధవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నారాయణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అజీమొద్దీన్, మండల అధ్యక్షుడు కందుకూరి రమేశ్, మాజీ జడ్పీటీసీ జగ్జీవన్‌రావు, నాయకులు ధరణి రాజేశ్, సాడిగే రాజ్‌కుమార్, లతీఫ్, సతీశ్, బబిత, ఆశన్న, రవీందర్, భూమన్న, కాలేరి రవి, తిరుపతి, మాజిద్, మతపెద్దలు ఉన్నారు.
ఉట్నూర్ రూరల్, సెప్టెంబర్ 29: బీర్సాయిపేట్కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కరీంను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పరామర్శించారు. పార్టీ పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని ఏంకా, నాగాపూర్, వడోనిలో పలువురు మృతి చెందగా, బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, ఎంపీటీసీ ఆత్రం లచ్చు, శ్రీరాంనాయక్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, నాయకులు రమేశ్, జగ్జీవన్, కుటికెల ఆశన్న ఉన్నారు.