
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
నేరడిగొండలో బీఎల్వోలతో సమావేశం
అంకోలి, వాన్వట్లో వ్యాక్సినేషన్ సెంటర్ల పరిశీలన
నేరడిగొండ, సెప్టెంబర్ 29 : మండలంలో ఓటరు నమోదు వందశాతం పూర్తిచేయాలని అధికారులు, బీఎల్వోలకు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు విధిగా కల్పించాలని సూచించారు. గతంలో కొంత నిర్లక్ష్యంగానే ఓటు హక్కు నమోదు ప్రక్రియ కొనసాగిందన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు. వందశాతం ఓటు హక్కు కలిగిన మండలంగా చూడాలని ఉందన్నారు. గ్రామాల్లో ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పించాలని సూ చించారు. ఈ సమావేశంలో జిల్లా నోడల్ అధికారి లక్ష్మణ్, టెక్నికల్ అధికారి ఉమాకాంత్, ఎం పీపీ రాథోడ్ సజన్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో అబ్దుల్ సమద్, బీఎల్వోలు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రాల పరిశీలన..
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 29 : మండలంలోని అంకోలి, వాన్వట్ గ్రామాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, మహితా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని నిర్మూలించాలంటే 18 ఏండ్లు పైబడిన వారందరూ తప్పని సరిగా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, మహితా స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ శ్రీకాంత్, మండల వైద్యాధికారి రోజారాణి, ప్రత్యేకాధికారి పద్మవిభూషణ్ రెడ్డి, ఎంపీడీవో శివలాల్, ఎంపీవో ఆనంద్, ఎంపీటీసీ జంగుబాబు, సర్పంచ్ శ్యామ్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.