
మన పత్తికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది..
పామాయిల్ సాగు చేసి అధిక లాభాలు పొందాలి..
భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో మంత్రి అల్లోల
ఎదులాపురం, ఆగస్టు 29 : రెడ్డి విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడానికే హాస్టల్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఇది ఉన్నత విద్యకు దోహదం చేస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో గల అగ్రజా టౌన్షిప్ వద్ద రెడ్డి హాస్టల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్‌తో కలిసి మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రెడ్డి కమ్యూనిటీవారు అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని.. పామాయిల్ సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు.
విద్యా ప్రమాణాల పెంపునకు ఏర్పాటు చేసిన రెడ్డి హాస్టల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇం ద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూహౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న అగ్రజా టౌన్షిప్ వద్ద రెడ్డి హాస్టల్ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ జ నార్దన్ రాథోడ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురా వ్, రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సంఘ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చిన ముఖ్య అతిథులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఐకే రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో రెడ్డి హాస్టల్ కేటాయించిన ప్పటికీ భూమి కోసం క్యాబినెట్ ఆమోదం తీసుకోవాల్సి ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, టీడీడీసీ చైర్మన్‌తో కలిసి భూమితో పాటు నిధులు ఇవ్వాలని కోరుతామన్నారు.
ఆనా డు రాజ్‌బహదూర్ హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో రెడ్డి హాస్టల్‌ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రెడ్డి వసతి గృహంలోనే ఎంతో మంది విద్యార్థులు చదువుకున్నారని తెలిపారు. ఆదిలాదాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన రెడ్డి సం క్షేమ సంఘ భవనానికి ఎమ్మెల్యే జోగు రామన్న రూ.25 లక్షల నిధులు ఇస్తున్నందున కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి హాస్టల్ భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు ప్ర త్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ పత్తికి చాలా డిమాండ్ ఉందన్నారు. రెడ్డి కులస్తులు చాలామంది వ్యవసాయం చేస్తున్నారని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు పామాయిల్ పంట సాగుపై దృష్టి సారించాలని సూచించారు. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సత్యనారాయణ ఆలయ కల్యాణ మండపం కోసం రూ.50లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుపై, ఇతర సమస్యలను సభాముఖంగా దృష్టికి తీసుకొచ్చారన్నారు. సీఎం కేసీఆర్ ఒక్కసారి ప్రకటించిన తర్వాత వెనక్కి తగ్గరని ఆయన పేర్కొన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా : జోగు రామన్న
రెడ్డి సంఘం ప్రోత్సాహంతోనే తాను నేడు ఈ స్థాయిలో ఉన్నందున ఆనందంగా ఉందని ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. రెడ్డి హాస్టల్ భవన నిర్మాణానికి రూ.కోటి అందించినట్లు పేర్కొన్నా రు. కేసీఆర్ నాయకత్వంలో ప్రతి సంఘ భవన ని ర్మాణాలకు, ఆలయాలకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. రెడ్డి సంఘం సూచనలు తీసుకుంటూ వారి అభ్యున్నతికి పాటుపడుతూ, వారితో మమేకమై ముందుకు సాగుతామన్నారు. జిల్లా కేంద్రం లో రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని కులాలకు న్యాయం చేస్తున్నారన్నారు. హాస్ట ల్ భవన నిర్మాణానికి తనవంతు సహాయంగా రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి రూ.1.16 లక్షలు, జడ్పీ మాజీ చైరపర్సన్ చిట్యాల సుహాసినిరెడ్డి రూ.లక్ష ఇస్తామని ప్రకటించారు. బద్దం దేవేందర్‌రెడ్డి రూ.25వేల చెక్కును అందజేశారు. ఆదిలాబాద్ డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ రఘునందర్ రెడ్డి, మాజీ ఎంపీ జీ నగేశ్, రాష్ట్ర అధ్యక్షుడు ఏను గు సంతోష్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నల్లా నారాయణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, జైనథ్ జడ్పీటీసీ ఆరుంధతి, ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసినిరెడ్డి, వార్డు కౌన్సిలర్ పవన్ నాయక్, సంఘం నాయకులు, మహిళా సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి సన్మానం..
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 29: జిల్లా కేంద్రంలోని న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు చేసిన సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు జాదవ్ పవన్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రుక్మారెడ్డి, వెంకట్ రెడ్డి, తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌ను మంత్రి పరామర్శించారు. కాలికి గాయం కావడంతో జిల్లా కేంద్రంలోని చైర్మన్ ఇంటికి వెళ్లి గాయానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జోగు రామన్న ఉన్నారు.
ఏజన్సీ ప్రాంతంలో రైతు బంధు ఇప్పిస్తాం
గుడిహత్నూర్, ఆగస్టు 29 : ఏజన్సీ ప్రాంతంలోనున్న గిరిజనేతరులకు రైతు బంధు ఇప్పిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొల్హారి గ్రామంలో భారతీయ సా హిత్య సామ్రాట్ అన్నాబావు సాటే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం లో సాగులోనున్న 33వేల ఎకరాల భూములకు రైతు బంధు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. అంబేద్కర్, అన్నాబావు సాటే లాంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథో డ్ బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, సర్పంచ్ గిత్తె కల్పన, డీసీసీబీ చైర్మన్ రఘునందన్‌రెడ్డి, మాజీ ఎంపీ జీ నగేశ్, అన్నాబావు సాటే అసోసియేషన్ అధ్యక్షుడు కాంబ్లే గణేశ్, ప్రధాన కార్యదర్శి డీకే మధుకర్, వ్యవస్థాపకుడు డీకే నాందేవ్, జిల్లా ఉపాధ్యక్షుడు భట్లాడే సూర్యకాంత్, మాధవ్ జివాడే, డీకే ఆనంద్, డీకే సంజీవ్, సుధాకర్, అర్జున్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, సర్పంచులు జీ తిరుమల్‌గౌడ్, కుమ్రం సంభు, దస్రు, లింగు, టీఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.