
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
ఆయిల్ పామ్ సాగు చేయాలి
నిరాడంబరంగా ఖానాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారం
ఖానాపూర్ టౌన్, ఆగస్టు 29: మార్కెట్ కమి టీ పాలకవర్గం రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందించాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఖానాపూర్ వ్య వసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన పాలకవర్గ పదవీ ప్రమా ణ స్వీకరణ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఏఎంసీ చైర్మన్‌గా పుప్పాల శంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వైస్ చైర్మన్‌గా గొర్రె గంగాధర్ ప్రమాణం చేశారు. నూ తనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని మంత్రి అల్లోల అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల రైతులకు పాలకవర్గ సభ్యులు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీర్చాలన్నారు. రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని పనులు మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. ఇక్కడి రైతులు రెండు పంటలు పం డించుకునేందుకు కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి నీళ్లను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. పొన్కల్ ప్రాంతంలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజ్ పనులు తుదిదశకు చేరుకున్నాయని, ఆ నిర్మాణం పూర్తి కాగానే ఇక్కడి రైతుల సాగునీటి కష్టాలు శాశ్వతం గా తీరుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిందని తెలిపారు. పంట మార్పిడి కింద ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న ఖమ్మం జిల్లాలోని అశ్యారావుపేట, సత్తుపెల్లి గ్రామాలను ఆదర్శంగా తీసుకొని మన జిల్లాలోనూ ఆ పంటను సాగు చేయాలని పేర్కొన్నారు.
రైతుల రుణం తీర్చుకుంటా: శంకర్, చైర్మన్
తనపై నమ్మకంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌కు, ప్రభుత్వానికి మార్కెట్ చైర్మన్ పుప్పాల శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సేవకే తన జీవితాన్ని అంకితమిస్తానని పేర్కొన్నారు. మార్కె ట్ యార్డులోని సమస్యలను ఎమ్మెల్యే సహకారం తో పరిష్కరిస్తామన్నారు. పాలకవర్గ సభ్యులను టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పాకల రాం చందర్ గజమాలతో ఘనంగా సన్మానించారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల జడ్పీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు మైనార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ పలువురు ఘనంగా సన్మానించారు.
మార్కెట్ పాలకవర్గం ఇదే..
ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గంలో మొత్తం 14 మందిని నియమించారు. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు డైరెక్టర్లుగా జక్కుల నవీన్ యాదవ్, పరాంకుశ శ్రీనివాస్, మహ్మద్ మెహ్రజుద్దీన్, రాథోడ్ పరశురాం, బోయిని మంగ, ఒడ్నాల సత్తెన్న, జీ సదానం దం, కట్కం విజయ్, అంకం రాజేందర్ (ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్)తో పాటు పీఏసీఎస్ చైర్మన్ సత్తనపెల్లి, జిల్లా మార్కెట్ శాఖ డీఎం, వ్యవసాయ శాఖ ఖానాపూర్ ఏడీఏలు డైరెక్టర్లుగా ఉ న్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రాంకిషన్, డీసీసీబీ చైర్మన్ రఘునందన్‌రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.