
బేల జడ్పీటీసీ అక్షిత
చంద్పెల్లిలోని ఆశ్రమ బాలికల పాఠశాల తనిఖీ
బేల, ఆగస్టు 29: పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని బేల జడ్పీటీసీ అక్షిత ప్రధానోపాధ్యాయులకు సూచించారు. చంద్పెల్లి గ్రామంలోని ఆశ్రమ బాలికల పాఠశాలను ఆదివారం ఆమె తనిఖీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించుకోవాలని, పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించాలని ప్రధానోధ్యాయుడు భోజన్నకు సూచించారు. ఆమె వెంట సర్పంచ్ జంగ్శౌవ్, ఉపాధ్యాయులు ఉన్నారు.
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి
నేరడిగొండ, ఆగస్టు 29 : పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీడీవో అబ్దుల్ సమద్ ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ పెంట వెంకటరమణ, ప్రధానోపాధ్యాయురాలు జయశ్రీ, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.
నార్నూర్, ఆగస్టు 29: విద్యా సంస్థలు సెప్టెంబర్ 1 నుంచి పునః ప్రారంభిస్తుండడంతో పాఠశాలల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు గాదిగూడ ఎంపీవో సాయిప్రసాద్ అన్నారు. గాదిగూడ మండలం పర్సువాడ(కే), అర్జుని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. పాఠశాల పరిసరాల్లో పిచ్చిమొక్కల తొలగింపు, మరుగుదొడ్లు శుభ్రం చేయించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు, సర్పంచ్లు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.