
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, జూన్ 29: ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని శాంతినగర్‌లో రూ.25లక్షలతో నిర్మించనున్న ప్రహరీ పనులకు, 35వ వార్డులో రూ.40లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంగళవారం భూ మిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి రూ.300కోట్లతో వివిధ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వార్డుల్లో సమస్యలను పూర్తిగా ప రిష్కరిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు అజ య్, నర్సింగ్, చర్చి ఫాదర్ సంజయ్, శ్యాంసన్, శ్యామూల్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
మారెమ్మతల్లికి ప్రత్యేక పూజలు …
జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో ఉన్న మారెమ్మ తల్లి ఆలయంలో 24వ వార్షికోత్సవం సందర్భం గా ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేక పూజలు చేశా రు. వర్షాలు కురువాలని బోనమెత్తారు. రైతుల పంటలు బాగా పండాలని వేడుకున్నారు. ప్రధాన దాత అశోక్ పటేల్, కస్తాల ప్రేమల, ఆలయ కమి టీ సభ్యులు దర్శ అశోక్, కొల రఘు, జోగు శివ తదితరులు పాల్గొన్నారు.