
నివాళులర్పించిన ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్
తాంసి, జూన్ 29: అనారోగ్యంతో మృ తి చెందిన ఆర్మీ జవాన్ దాసరి నవీన్ (26) అంత్యక్రియలు మండలంలోని పొన్నారిలో మంగళవారం ముగిశాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నవీన్ విధులు నిర్వర్తి స్తూ ఈనెల 26న బ్లడ్ క్యాన్సర్తో మృతి చెందా రు. కాగా, మంగళవారం ఆయన అంత్యక్రియల కు చుట్టుపక్కల మండలాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు, మిత్రులు పాల్గొన్నారు. కుటుంబ స భ్యులు, బంధువులు, మిత్రుల రోదనలతో పొన్నా రి కన్నీటి సంద్రంగా మారింది. నవీన్ పార్థివదే హం వద్ద ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావ్, జోగు రామన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, పలువురు నాయకులు నివాళులర్పించారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు…
ఆర్మీ జవాన్ నవీన్ అంత్యక్రియలకు ఆర్మీ, పోలీస్ అధికారులు హాజరై, ఘన నివాళులర్పించారు. ఆయన మృతికి గౌరవ సూచకంగా ఏఆర్ పోలీసులు వందనం సమర్పించి మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం వారి కుటుంబ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. ఆర్మీ కల్నల్ ఆర్వీకే సింగ్, ఆర్మీ అధికారి అమృత్సింగ్, ఏఆర్ ఎస్ఐ శ్రీనివాస్, తాంసి ఎస్ఐ శిరీషా తదితరులు పాల్గొన్నారు.